బిజినెస్ వార్తలు

మినిమం బ్యాలెన్స్ రూల్.. మూడేళ్లలో బ్యాంకులకు రూ.8 వేల కోట్ల ఆదాయం…

  • ఆధార్ తో పాన్ లింక్ రూల్ తో రూ.2 వేల కోట్లు
  • ట్యాక్స్ రిటర్న్ ఆలస్యం రూల్ ద్వారా రూ.7 వేల కోట్లు
  • ఛార్జీల రూపంలో బ్యాంకులకు వచ్చిన ఆదాయం వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి

బ్యాంకు ఖాతాల్లో ఎల్లప్పుడూ మినిమం బ్యాలెన్స్ ఉంచాలని, ఆ మొత్తం లేకుంటే బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తాయని తెలిసిందే. ఇలాంటి ఖాతాల నుంచి బ్యాంకులకు పెద్ద మొత్తం వచ్చిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి తెలిపారు. మూడేళ్లలో 11 ప్రభుత్వరంగ బ్యాంకులకు ఇలా మినిమం బ్యాలెన్స్ చార్జీల కింద రూ.8,092 కోట్లు వసూలైందని చెప్పారు.

2022-23లో రూ.2,407.82 కోట్లు, 2023-24లో రూ.2,909.1 కోట్లు, 2024-25లో రూ.2,775.91 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. ఇక, ఎస్ఎంఎస్ ఛార్జీల కింద కస్టమర్ల నుంచి రూ.3,387.77 కోట్లు, పాన్‌ – ఆధార్‌ కార్డు లింక్‌ లో జాప్యానికి ఆలస్య రుసుము కింద రూ.2,335.75 కోట్లు, ఆలస్యంగా రిటర్న్‌లు దాఖలు చేసిన వారి నుంచి ఫైన్ రూపంలో రూ.7,664.94 కోట్లు వసూలు చేసినట్లు లోక్‌సభలో మంత్రి వెల్లడించారు.

Related posts

అమెజాన్‌లో కొత్త ఫీచర్ గమనించారా…?

Ram Narayana

ప్రపంచ బిలియనీర్ల ఉమ్మడి సంపద రెట్టింపు.. ఆసక్తికర రిపోర్ట్ విడుదల!

Ram Narayana

క్విక్ కామర్స్‌లోకి అమెజాన్.. ఇక 15 నిమిషాల్లోనే డెలివరీ!

Ram Narayana