Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మోడీ తిరిగి అధికారంలోకి వస్తే పేదల బతుకులు బుగ్గిపాలే: మంచిర్యాల సభలో ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే!

మోడీ తిరిగి అధికారంలోకి వస్తే పేదల బతుకులు బుగ్గిపాలే: మంచిర్యాల సభలో ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే!
అంబేద్కర్ ఆశయాల కోసం పట్టించుకున్న పాపానపోలేదు
పబ్లిక్ రంగసంస్థలను అమ్ముతున్నారు
సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల ఊసేలేదు
ధరలు పెరుగుతున్నా పట్టించుకోవడంలేదు
గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందిపెట్రోల్ , డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయి
రైతులకు గిట్టుబాటు ధరలు లేవుఆత్మహత్యలు ఆగడంలేదు

మోడీ తిరిగి అధికారంలోకి వస్తే పేదల బతుకులు బుగ్గిపాలు కావడం ఖాయమని ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే మోడీ విధానాలపై తీవ్రస్వరంతో ధ్వజమెత్తారుసీఎల్పీ నేత భట్టి పాదయాత్ర సందర్భంగా రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ మంచిర్యాల లో ఏర్పాటు చేసిన దీక్ష సభలో ఖర్గే ముఖ్యఅతిథి గా పాల్గొని ప్రసంగించారు .

బీజేపీ ప్రభుత్వం వచ్చి ప్రజాస్వామ్యాన్ని ,విలువలను మంటగలిపిందని దుయ్యబట్టారు .రాంజ్యాంగాన్ని రచించి దేశదిశ మార్చిన మహానుభావుడు అంబేద్కర్ ఆశయాలను పట్టించుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారుపబ్లిక్ రంగ సంస్థలను మోడీ అధికారంలోకి వచ్చినతర్వాత అమ్మేస్తున్నారని విమర్శలు గుప్పించారు . ఎయిర్ పోర్టులు, ఓడరేవులు ,చివరకు సింగరేణి అమ్మెందుకు సిద్ధపడుతున్న విషయాన్నీ ఖర్గే గుర్తు చేశారు . ఇక అమ్మకుండా మిగిలింది గాలి ఒక్కటే వ్యంగ్యంగా అన్నారు .
బీజేపీ పాలననుంచి దేశాన్ని రక్షించాలిసిన అవసరం ఉందని కాంగ్రెస్ పాలనా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు . బీజేపీ విచిన్నవాదం ,ప్రాంతీయతత్వం , కులాలు ,మతాల మధ్య చిచ్చు పెడుతుందని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు . ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఏమైయ్యాయి మోడీని ప్రజలే ప్రశ్నింస్తున్నారని అన్నారు . పేదవారి అభ్యన్నతికోసం ఇటు రాష్ట్రం గానీ ఆటు కేంద్ర ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు . ధరలు పెరుగుదల ,, పెట్రోల్ ,డీజిల్ ధరలపై ఏమాత్రం కంట్రోల్ లేదని ధరాభారంతో ప్రజలు ప్రధానంగా పేదలు బాధపడుతున్నారని ప్రజారంజక పాలన అందించాలంటే అది ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమని ఖర్గే అన్నారు .

ఏఐసీసీ పిలుపు మేరకు హత్ యాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ పాలన పేదల వ్యతిరేకంగా సాగుతుందని విమర్శలు గుప్పించారు . మంచిర్యాల లో జరిగిన జై భారత్ సత్యాగ్రహ సభలో పాల్గొని ప్రసంగించారుదేశాన్ని కాపాడాల్సిన భాద్యత మనమీద ఉందని అందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాలని కోరారు . పాదయాత్రలో భాగంగా తనకు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ శక్తిని
నింపిందని అన్నారుప్రజల సంపద ప్రజలకే చెందాలని భట్టి డిమాండ్ చేశారుసంపదను కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు . సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు దేశానికి స్వతంత్రం తెచ్చిందని అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటే ఆయనపై కేసులు పెట్టి పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడం దుర్మార్గమని అన్నారు .ఆదిలాబాద్ జిల్లాలో అపారమైన వనరులు ఉన్నాయని, గిరిజనబిడ్డలు తమ సమస్యలు చెప్పుకున్నారని తనను అక్కున చేర్చుకున్నారని భట్టి వివరించారు .పేదలకు ఇచ్చిన భూములు లాక్కుంటున్న చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారుకాళేశ్వరం ప్రాజక్టు లో కేసీఆర్ ను ముంచడం ఖాయంప్రాణహిత చేవెళ్ల ప్రాజక్టు పూర్తీ చేసి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు ..సింగరేణి ఉద్యోగాలు తగ్గించారు . లక్ష 25 వేల ఉద్యోగాలు ఉంటె ఇప్పుడు 45 వేల తగ్గించిన ఘనత కేసీఆర్ దే అని భట్టి విమర్శలు గుప్పించారు . కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లో ప్రవేట్ పరం కానివ్వమని మాట ఇచ్చారు .. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షలు ఇస్తామన్నారు …. దళితులకు మూడు ఎకరాలు , దళితబంద్, దళిత సీఎం అన్న ముఖ్యమంత్రి చెప్పిన మతాలు ఏమయ్యాయని ప్రశ్నించారు …? పేదలకు చెందాల్సిన అస్సైన్మెంట్ భూములను పెద్దలు గద్దల్లా ఆక్రమించారని ఆరోపించారు .

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మాట్లాడుతూమంచిర్యాల గడ్డ కాంగ్రెస్ అడ్డా ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 సీట్లకు 10 రావాల్సిందేనని అన్నారు . …ప్రేమ్ సాగర్ ,సురేఖమ్మల నాయకత్వంలో అన్ని సీట్లు గెలుస్తామనే నమ్మకం ఉందన్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనకబడ్డ ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు దత్తత తీసుకుంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు . రాష్ట్రప్రభుత్వం ఈరోజు ఘనంగా చెప్పుకుంటున్న అంబేద్కర్ విగ్రహం 125 జయంతి సందర్భంగా మొదలు పెట్టి పూర్తీ చేయడానికి 7 సంవత్సరాలు పట్టిందని విమర్శించారు . ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ది కదా అని ప్రశ్నించారుఓట్ల కోసం దళిత జపం చేస్తున్న కేసీఆర్ దళితున్ని మంత్రివర్గంనుంచి భర్తరఫ్ ఎందుకు చేశావని ప్రశ్నించారు .. ఒక బీసీ ని అవినీతి ఆరోపణలు చేసి తప్పుంచావు .. మరి నీ బిడ్డమీద, కొడుకు మీద వచ్చిన ఆరోపణలపై ఏమి చర్యలు తీసుకున్నావు అని ప్రశ్నించారుకర్ణాటకలోనూ , తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అప్పుడు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తుందని హామీ ఇచ్చారు . లీకులు , లిక్కర్ స్కాం లు కేసీఆర్ ప్రభుత్వాన్ని పారదోలాల్సిందేనని పిలుపు నిచ్చారుపార్టీలో గురింపు తెచ్చుకున్న నాయకులూ కొందరు వెళ్లి పోయారుఎండి పోయిన ఆకులు కొన్ని రాలినా ఇబ్బంది లేదు ..కొత్తవారిని తయారు చేసుకుంటామన్నారు .సభలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యరావు ఠాక్రే ,ఏఐసీసీ నాయకులూ కొప్పుల రాజు ,సంపత్ , శ్రీధర్ బాబు , ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,ఉత్తమకుమార్ రెడ్డి ,ప్రేమ్ సాగర్ రావు తదితరులు ప్రసంగించారు .సభకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ అధ్యక్షత వహించారు.

Related posts

బద్వేల్ బీజేపీ అభ్యర్థి సురేష్ ….

Drukpadam

ఘనంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ 98 వార్షికోత్సవాలు …

Drukpadam

బీజేపీలో మగాళ్లు లేరా?: ఓ మహిళను బలిపశువు చేశారు: ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి

Drukpadam

Leave a Comment