Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మోడీ సేవలు సంపన్నుల కోసమే…ప్రముఖ పాత్రికేయులు శ్రీనివాస్ రెడ్డి…

మోడి సేవలు సంపన్నుల కోసమే…ప్రముఖ పాత్రికేయులు శ్రీనివాస్ రెడ్డి…
రాజ్యాంగ ప్రమాణాలకు పాతరేసిన బిజేపి
కమ్యూనిస్టులను విమర్శిస్తోంది పార్టీలు మార్చేవారే.
చర్లలో ఘనంగా ప్రారంభమైన జనచైతన్యయాత్ర

ప్రధాని మోడి పేద , మధ్య తరగతి ప్రజలను విస్మరించి సంపన్నుల సేవలో మునిగితేలుతున్నారని ప్రజాపక్షం సంపాదకులు కే శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బ్రిటీష్ తొత్తులుగా పనిచేసి జాతీయ జెండాను, రాజ్యాంగాన్ని నేటికీ సరైన రీతిలో గౌరవించని వ్యక్తులు, సంస్థలతో దేశానికి పెను ప్రమాదమని ఉందని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడు జిల్లా సిపిఐ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర శుక్రవారం చర్లలో ప్రారంభమైంది. సభ ప్రారంబానికి ముందు భారీ ర్యాలీ నిర్వహించి, భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేదర్ విగ్రహానికి సిపిఐ నాయకులు ఎ సాబీర్ పాపా, బి అయోధ్య, రావులపల్లి రాంప్రసాద్, సునీల్ కుమార్ తదితరులతో కలిసి పూల సుమాలు వేసి నివాళులర్పించారు . అనంతరం చర్ల సెంటర్లో రావులపల్లి రాంప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం రాజకీయ, ఆర్థిక, సామాజిక స్వేచ్ఛను ఇచ్చిందని, ఇప్పుడు ఆ స్వేఛ్ఛకు ప్రస్తుత పాలకులు భంగం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. సంపద కేంద్రీకృతం కాకూడాడని, అందరికీ చెందేలా రాజ్యాంగం. రూపొందించారని అన్నారు . జాతీయ జెండాను, భారతరాజ్యాంగాన్ని ఇప్పటి బీజేపీకి మూల సంఘాలైన ఆర్ఎస్ఎస్,జనసంఘ్ లాంటి సంఘలు తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు స్వతంత్రయ దినోత్సవాన్ని చీకటి రోజుగా ఆ నాటి వారి పత్రిక ఆర్గనైజర్ ప్రకటించారన్నారు. ఇప్పుడు అధికారంలోనికి వచ్చిన తర్వాత నాగపూర్లో జాతీయ జెండాను అగౌరవ పద్దతుల్లో ఎగురవేస్తున్నారని నుండిపడ్డారు. బీజేపీ రాజ్యాంగ ప్రమాణాలకు పాతరేస్తోందని, చేసిన ప్రమాణాలకు వ్యతిరేకంగా వ్యవహింస్తోందన్నారు.వాజ్ పేయి హయాంలోనే రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నించారని కానీ అధి సాధ్యం కాలేరన్నారు. రాజ్యంగ మౌళిక సూత్రాలను విస్మరించి ఇష్టాను రీతిగా మార్చుకుంటామని అంటున్నారని, లౌకికవాదం వద్దూ… హిందూత్వమే ముద్దు అన్న రీతిలో బిజేపి తీరుందన్నారు. నిబంధనలు లేని ఆర్ధిక వ్యవస్థ కోసం బీజేపీ వెంపర్లాడుతోందని, స్వతంత్ర ఉద్యమంలో వారి పాత్రలేని అన్నారు . బిజేపి తీరుతో ఎస్సీ ,ఎస్టీ లకు రిజర్వేషన్ సౌకర్యం లేకుండా యత్నిస్తోందని, మతమైన రాజ్యాలు ఏమి సాధించాయో పాకిస్తాన్ ను చూస్తే అవగతం అవుతుందన్నారు. బికేసి పాలనలో ప్రభుత్వం రంగం స్థానే ప్రైవేటు రంగం నికృతమవుతోందని, నష్టాల పేరుతో మోడీ ప్రసిద్ది. గాంచిన సంస్థలను అమ్మేస్తున్నారని ఆయన ఆరోపించారు. వేలాది ఉద్యోగాలు ప్రభుత్వం రంగంలో దక్కాల్సి ఉండగా, అవి రాకుండా పోతున్నాయని తెలిపారు. కరోనాలో ప్రభుత్వాలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కున్నాయని, ఎగువ మధ్య తరగతి ప్రజలు సైతం ఇబ్బందులు పడ్డారని, కానీ మోడి స్నేహితుడు ఆదానికీ రోజుకు వెయ్యి కోట్ల ఆదాయం సమకూరిందని, ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతాలు ఇప్పటికీ దయనీయంగానే ఉన్నాయని, మందులు దొరక మలేరియా, డయేరియాతో ఇబ్బందులు పడుతున్నారని , యుక్త వయసుకు వచ్చిన ఆడ పిల్లలు చదువుకునే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ రాజ్యాంగాన్ని సవరించి దొడ్డి దారిన వందలకోట్లు చందాలు పోగుసుకుంటుందని విమర్శయించారు . జాతిపిత గాంధీజీని చంపిన వారసుల నుంచి ఇంతకంటే దేశ ప్రజలు ఎక్కువ ఆశించేదేముందని అన్నారు. మతవాద సంస్థలను బలోపేతందం ద్వారా ఆ పార్టీ స్వరూపం బయట పడుతోందన్నారు. కమ్యూనిస్టులను విమర్శించేది అవకాశ వాదులు, అంచగొండులు, దోపిడీ దారులే అని ఆయన తెలిపారు.

జాతీయహోదా రద్దుతో సిపిఐకి వచ్చే నష్టమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. 12- రాష్ట్రాలు, I కేంద్ర పాలిత ప్రాంతాల్లో సిపిఐకి శాఖలు ఉన్నాయని, లక్షలాది నుంచి సిపిఐ నేతృత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. వేలాది కోట్లు వెచ్చించి ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో ఆర్ధిక పోటీలో వెనుకబడుతున్నామని , ఆదరణ లేక కాదని స్పష్టం చేశారు. అడవిని కాపాడి, అడవి కోసం, అడవి లోనే జీవించే పోడురైతులందరికీ కేసిఆర్ ప్రభుత్వం హక్కు పత్రాలు ఇవ్వాలని, లేదంటే ప్రతిఘటన తప్పదన్నారు. అనేక దశాబ్దాల పాడు సాగుచేసుకుంటున్న సుమారు లక్షల మందికి 11 లక్షల ఎకరాలకు పై బడి పోడు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్. పాష, రాష్ట్ర కార్యవర్ల సభ్యులు బొల్లోజు అయోధ్య తదితరులు ప్రసంగించారు. సిపిఎం నాయకులు యలమంచిలి రవి కుమార్, మచ్చా వెంకటేశ్వరు సంఘీభావం తెలివి మాట్లాడారు. ఈ యాత్రలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, మిర్యాల రంగయ్య, సారయ్య, ముత్యాల విశ్వకారం, ఏపూరి బ్రహ్మం, రావులపల్లి రవికుమార్, మున్నా లక్ష్మీ కుమారి, నటి ప్రసాద్, గుత్తుల సత్యనారాయణ, బందెం నిర్భయ్య, ఎల్లయ్య, అనోజ్ సునీల్ కుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. వద్ద నుండి భద్రాచలం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా యాత్రకు ఘనస్వాగతం లభించింది. పలు చోట్ల జరిగిన సభల్లో సిపిఐ నాయకులు ప్రసంగించారు…

Related posts

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు షడ్యూల్ విడుదల -అక్టోబర్ 17 ఎన్నిక…

Drukpadam

ఓ పార్టీలో గెలిచి.. ఇంకో పార్టీలో చేరితే ఉరి శిక్ష వేయాలి: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

‘ఆర్ఎస్ఎస్’పై సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఒవైసీ!

Drukpadam

Leave a Comment