Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రఘరామను ఆటవిక రీతిలో హింసించార-చంద్రబాబు

రఘురామకృష్ణరాజును సీఐడీ ఆఫీసులో ఆటవిక రీతిలో హింసించారు: చంద్రబాబు
సీఐడీ కోర్టులో రఘురామ హాజరు
రఘురామ కాళ్లకు గాయాలు
తీవ్రంగా స్పందించిన చంద్రబాబు
ప్రశ్నించడమే నేరమా అంటూ ఆగ్రహం

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రెండు కాళ్లకు గాయాలైన స్థితిలో కోర్టుకు హాజరవడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. రఘురామకృష్ణరాజును అన్యాయంగా అరెస్ట్ చేయడమే కాకుండా, ఏపీ సీఐడీ కార్యాలయంలో ఆటవిక రీతిలో హింసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ నేరస్తుడైన ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుంటే ప్రశ్నించడమే రఘురామ చేసిన నేరమా? అని చంద్రబాబు నిలదీశారు.

పట్టపగలు ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంపై ఉన్న నమ్మకాన్ని ఇప్పుడు ప్రశ్నార్థకంగా మార్చారని వ్యాఖ్యానించారు. అయితే, రాజ్యాంగం, న్యాయవ్యవస్థ ధర్మాన్ని నిలబెడతాయని తాను విశ్వసిస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. ప్రజాస్వామ్య భద్రత, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అధర్మం ఎక్కడున్నా, అది ప్రతిచోట ధర్మానికి ముప్పుగానే పరిణమిస్తుందని చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

ఎంపీ శరీరంపై నిన్న లేని దెబ్బలు ఇవాళ ఎలా వచ్చాయి?: డివిజన్ బెంచ్

రఘురామను అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
ఎంపీ కేసు విచారణకు డివిజన్ బెంచ్ ఏర్పాటు
రఘురామ కాలి గాయాలను తీవ్రంగా పరిగణించిన బెంచ్
గాయాల నిర్ధారణకు మెడికల్ టీమ్
రిమాండ్ రిపోర్ట్ రద్దు చేయాలన్న రఘురామ న్యాయవాదులు
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు కేసును విచారించేందుకు ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఏర్పాటు చేసింది. జస్టిస్ ప్రవీణ్ ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ ప్రస్తుతం విచారణ మొదలెట్టింది. రఘురామ తరఫున సీనియర్ అడ్వొకేట్ ఆదినారాయణరావు స్పెషల్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా రఘురామ తరఫు న్యాయవాదులు తమ క్లయింటు కాలి గాయాలను కోర్టుకు చూపించారు. ఈ నేపథ్యంలో, సీఐడీ అధికారుల తీరుపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పార్లమెంటు సభ్యుడి శరీరంపై నిన్న లేని గాయాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని, కారణమేంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. కస్టడీలో ఉన్న వ్యక్తిని కొట్టినట్టు నిరూపితమైతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని సీఐడీ అధికారులను హెచ్చరించారు. ఎంపీ శరీరంపై ఉన్న గాయాల నిర్ధారణకు మెడికల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

వాదనల సందర్భంగా…. రిమాండ్ రిపోర్టును వెంటనే రద్దు చేసి, రఘురామను విడుదల చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. రఘురామను నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.

Related posts

అన్న కొడుకు పెళ్ళిలో అంతా తానై వ్యవహరించిన మంత్రి పువ్వాడ అజయ్ …

Drukpadam

టోల్ చార్జీలను ఇక మీదట గూగుల్ మ్యాప్స్ లో చూసుకోవచ్చు!

Drukpadam

అప్పుల రాష్ట్రంగా తెలంగాణ…సీఎల్పీ నేత భట్టి ధ్వజం

Drukpadam

Leave a Comment