Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

ముంబై దాటికి కోల్ కత్తా విలవిలా….!

  • ముంబై దాటికి కోల్ కత్తా విలవిలా….!
    -వెంకటేష్ అయ్యర్ సెంచరీ వృధా …
    -లక్ష్యాన్ని ఊదిపడేశారు… ముంబయి ఇండియన్స్ ఈజీ విన్
    -ఐపీఎల్ తాజా సీజన్ లో రెండో విజయం సాధించిన ముంబయి
    -నేడు కోల్ కతాపై 5 వికెట్ల తేడాతో విజయం
    -186 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో ఛేదించిన ముంబయి ఇండియన్స్
    -విజృంభించిన ఇషాన్ కిషన్
    -రాణించిన సూర్యకుమార్, తిలక్ వర్మ, రోహిత్, టిమ్ డేవిడ్

ఐపీఎల్ తాజా సీజన్ లో కాస్త లేటుగా ఫామ్ లోకి వచ్చిన ముంబయి ఇండియన్స్ ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 186 పరుగుల లక్ష్యాన్ని 14 బంతులు మిగిలుండగానే ఛేదించింది. 17.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.

యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 25 బంతుల్లోనే 58 పరుగులు చేయడం విశేషం. 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాదిన కిషన్ ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ కు సరైన ఊపునిచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దిగిన రోహిత్ శర్మ 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 20 పరుగులు చేశాడు.

తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ ద్వారా ఫామ్ లోకి రావడం ముంబయి ఇండియన్స్ శిబిరాన్ని సంతోషానికి గురిచేసింది. సూర్య ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 43 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

ఇక, తెలుగుతేజం తిలక్ వర్మ తన ఫామ్ ను ఈ మ్యాచ్ లోనూ కంటిన్యూ చేశాడు. 25 బంతులాడిన తిలక్ వర్మ 3 ఫోర్లు, 1 సిక్స్ తో 30 పరుగులు చేశాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ 13 బంతుల్లో 1 సిక్స్, 2 ఫోర్లతో 21 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ సుయాశ్ శర్మ 2, శార్దూల్ ఠాకూర్ 1, వరుణ్ చక్రవర్తి 1, లాకీ ఫెర్గుసన్ 1 వికెట్ తీశారు. అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ (104) సెంచరీ సాధించడం కోల్ కతా ఇన్నింగ్స్ లో హైలైట్ గా నిలిచింది.

Related posts

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం…నివ్వెర పోయిన క్రికెట్ ప్రపంచం !

Drukpadam

ఐపీఎల్ వేలం: ఇషాన్ కిషన్ కోసం రూ.15.25 కోట్లు కుమ్మరించిన ముంబయి!

Drukpadam

మూడో టెస్టులో టీమిండియా నిర్ణయాలపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన గవాస్కర్!

Drukpadam

Leave a Comment