రాహుల్ గాంధీనీ కలిసిన టి.కాంగ్రెస్ నేతలు…. భట్టి పాదయాత్రపై ఆరా …!
భట్టి యాత్రకు మంచి స్పందన ఉందన్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి
భట్టి పాదయాత్ర సభకు బాగా జనసమీకరణ జరిగిందని ఖర్గే చెప్పారన్న రాహుల్
పాదయాత్ర కు అవసరమైన ఏర్పాట్లు చేయాలనీ సూచన
రాష్ట్ర రాజకీయాల మీద చర్చ….
ఎన్నికలకు ఒంటరిగానే వెళ్ళాలి అని రాహుల్ సూచన..
ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ భట్టి నిర్వహిస్తన్న హత్ సే హత్ జోడో యాత్రపై రాహుల్ గాంధీ ఆరా తీశారు . కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన తిరిగి ఢిల్లీ వెళుతున్న రాహుల్ గాంధీని శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యరావు ఠాక్రే , టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు . ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర గురించి ఆరాతీశారు .
భట్టి పాదయాత్ర సందర్భంగా జరిగిన బహిరంగ సభ బాగా జరిగినట్లు ఖర్గే చెప్పారని రాహుల్ అనడంతో వెంటనే మాణిక్యరావు ఠాక్రే జోక్యం చేసుకొని భట్టి యాత్రకు ఊహించినదానికంటే ప్రజల నుంచి ఆదరణ ఎక్కువగా ఉందని అన్నారు . పాదయాత్ర బాగా జరుగుతుంది అని,ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది అని తెలిపారు … పాదయాత్ర సజావుగా జరిగేట్లు అవసరమైన ఏర్పాట్లను చూడాలని రాహుల్ సూచించారు .
ఈసందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కూడా రాహుల్ గాంధీ ఆరా తీశారు . ఎన్నికలకు ఒంటరిగానే వెళ్లాలని చెప్పినట్లు సమాచారం …అదే సందర్భంలో కొత్తగా పార్టీలోకి చేరే వారి గురించి కూడా రాహుల్ వాకబు చేశారని తెలుస్తుంది. దీనిపై రేవంత్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చేరేవారి గురించి వివరించినట్లు సమాచారం … ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని పార్టీ నేతల మధ్య ఐక్యత తీసుకోని రావాలని అందరిని కలుపుకుని వెళ్లాలని రేవంత్ రెడ్డికి రాహుల్ సూచించారు . ఈసారి పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని అందుకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలి రాహుల్ నేతలకు దిశా నిర్దేశం చేశారు …టీం వర్క్ చేయాలనీ నేతల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు తొలగించాలని సూచించినట్లు సమాచారం….