Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరం న్యూయార్క్..!

  • న్యూయార్క్ లోనే 3.4 లక్షల మంది మిలియనీర్లు
  • 2.9 లక్షల మంది మిలియనీర్లతో రెండో స్థానంలో టోక్యో
  • టాప్ 97 నగరాల జాబితా విడుదల చేసిన హెన్లీ అండ్ పార్ట్ నర్స్

ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరంగా న్యూయార్క్ సిటీ మరోమారు నిలిచింది. ఈ భూమ్మీద ఎక్కువ మంది సంపన్నులు ఈ నగరంలోనే నివసిస్తున్నారని వెల్త్ ట్రాకర్ కంపెనీ హెన్లీ అండ్ పార్ట్ నర్స్ వెల్లడించింది. ఈ మేరకు 2023 ఏడాదికి సంబంధించి ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్ లో న్యూయార్క్ మళ్లీ టాప్ లో నిలిచింది.

అమెరికాలోని న్యూయార్క్ లో ఏకంగా 3.40 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారని తెలిపింది. వంద మిలియన్ డాలర్లకు పైబడి (సెంటి మిలియనీర్స్) ఆస్తులు ఉన్న వారి సంఖ్య 724 కాగా 58 మంది బిలియనీర్లు కూడా ఈ నగరంలో ఉంటున్నారని వెల్లడించింది. అమెరికాలోని నాలుగు సిటీలు న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిలిస్, షికాగో లకు ఈ జాబితాలో చోటు దక్కింది.

ప్రపంచంలోని అత్యంత ధనిక నగరాల పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో మొత్తం 97 నగరాలకు చోటు దక్కింది. న్యూయార్క్ మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానంలో జపాన్ రాజధాని టోక్యో నిలిచింది. ఇక్కడ 2.90 లక్షల మంది మిలియనీర్లు నివసిస్తున్నారని హెన్లీ అండ్ పార్ట్ నర్స్ తన రిపోర్టులో పేర్కొంది.

మూడో స్థానాన్ని శాన్ ఫ్రాన్సిస్కో దక్కించుకుంది. ఈ సిటీలో 2.85 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారని తెలిపింది. 2000 సంవత్సరం నాటికి ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరంగా పేరొందిన లండన్.. ప్రస్తుత జాబితాలో నాలుగో స్థానానికి పడిపోయింది. లండన్ తర్వాతి స్థానంలో సింగపూర్ నిలిచింది. చైనా రాజధాని బీజింగ్, షాంఘైలకూ ఈ జాబితాలో చోటు దక్కింది.

ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్ కు చోటు.. 

  • భాగ్యనగరంలో 11,100 మంది మిలియనీర్లు
  • 97 పట్టణాలతో జాబితా విడుదల చేసిన హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ
  • దేశ ఆర్థిక రాజధాని ముంబైకి 21వ స్థానం
  • ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు నగరాలకూ చోటు
Hyderabad  Lists among worlds richest cities

ఐటీ, ఫార్మా, నిర్మాణ రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ ప్రపంచ నగరంగా మారుతోంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు చోటు దక్కింది. ఈ జాబితాలో భాగ్యనగరం 65వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ లో 11,100 మంది మిలియనీర్లు ఉన్నట్లు హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది. అంతేకాదు 2012 నుంచి 2022 మధ్య పదేళ్ల కాలంలో‘అత్యధిక నికర సంపదగల వ్యక్తుల సంఖ్య 78 శాతం పెరిగినట్టు తెలిపింది. హెన్లీ అండ్ పార్ట్నర్స్ రూపొందించిన ‘ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల నివేదిక 2023’లో మొత్తం 97 పట్టణాలు చోటు దక్కించుకున్నాయి. 

భారత్ నుంచి హైదరాబాద్ సహా ఐదు నగరాలు ఇందులో ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై 21వ స్థానం దక్కించుకొంది. 59,400 మంది మిలియనీర్లతో ముంబై భారత్ నుంచి అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ 30,200 మిలియనీర్లతో మొత్తంగా 36వ స్థానంలో ఉండగా.. బెంగళూరు 12,600 మంది మిలియనీర్లతో 60వ స్థానంలో నిలిచింది. కోల్ కతా 12,100 మందితో 63వ స్థానంలో, హైదరాబాద్ 11,100 మందితో 65వ స్థానంలో ఉన్నాయి. ప్రపంచ నగరాల జాబితాలో అమెరికాలోని న్యూయార్క్ సిటీ అగ్ర స్థానంలో నిలిచింది. న్యూయార్క్ లో 3,40,000 మంది మిలియనీర్లు ఉన్నట్లు హెన్లీ అండ్ పార్ట్నర్స్ వెల్లడించింది.

Related posts

స్ఫూర్తినిచ్చే రతన్ టాటా కొటేషన్లు కొన్ని…!

Drukpadam

నూతన సంవత్సరంలో 5జీ సేవలు…జాబితాలో హైదరాబాద్!

Drukpadam

నేపాల్ లో ఐదు రోజుల దీపావళి!

Drukpadam

Leave a Comment