Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తుమ్మల సై అంటున్నారా …? సైలెంట్ అయ్యారా …??

తుమ్మల సై అంటున్నారా …? సైలెంట్ అయ్యారా …??
తుమ్మలకు సీఎం ఇచ్చిన అభయం ఏమిటి …
అంతుచిక్కని తుమ్మల రాజకీయ వ్యూహం
రాజకీయ దురంధరుడి ఆలోచనలపై అభిమానుల ఎదురు చూపులు
చివరిసారి తనకు అవకాశం ఇవ్వాలని సీఎం ను కోరినట్లు సమాచారం
సీఎం తనతో కలిసి పనిచేయాలని సూచించినట్లు ప్రచారం..

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మాజీ మంత్రి రాజకీయ దురంధరుడు తుమ్మల నాగేశ్వరరావు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారా …? సైలెంట్ అయ్యారా ..?? అనే సందేహాలు కలుగుతున్నాయి. కొంతకాలం క్రితం వరకు బీఆర్ యస్ రాజకీయాలకు దూరంగా ఉన్న తుమ్మల ఖమ్మం బీఆర్ యస్ సభ దగ్గర నుంచి దగ్గరైయ్యారు . పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు . అంతకు ముందు కలిసేందుకు సైతం విముఖత చూపిన సీఎం కేసీఆర్ జిల్లాలో మారిన రాజకీయపరిస్థితుల దృష్ట్యా తుమ్మలను దగ్గరకు తీసుకున్నారు . అయితే ఆయనకు ఎలాంటి హామీ ఇచ్చారనేది తెలియనప్పటికీ తనతో కలిసి పనిచేయాలని సీఎం తుమ్మలను కోరినట్లు ప్రచారం జరుగుతుంది. కలిసి పనిచేయడం అంటే ఏమిటి అనే గుసగుసలు బయలుదేరాయి. ఎంపీ గా పోటీ చేయిస్తారా ..? లేక రాజ్యసభ కు పంపుతారా ..? అనే చర్చ జరుగుతుంది…

తాను నామినేటెడ్ పదవులు , ఎమ్మెల్సీ పదవులపై ఆసక్తిలేని తుమ్మల … ప్రజా క్షేత్రమే తన కార్యక్షేత్రమని తరచూ చెపుతుంటారు … తన మనసులో మాటను సీఎం దగ్గర కూడా ప్రస్తావించినట్లు సమాచారం …అందుకు సీఎం ఏమి చెప్పినప్పటికీ విజయమో ,వీరస్వర్గమో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని నిన్నమొన్నటివరకు గట్టి పట్టుదలతో ఉన్న తుమ్మల కొంత సైలంట్ అయినట్లుగా కనిపిస్తున్నారు .గతంలో తరచూ పాలేరు లో పర్యటించి తన అనుయాయులను అభిమానులను కలుసుకునే తుమ్మల ఇటీవల కాలంలో పాలేరు వైపు కన్నెత్తి చూడటంలేదు . అందువల్ల ఆయన సై అనుకున్న అసెంబ్లీ పోటీపై సీఎం ఎదో మంత్రం వేశారని అందుకే సైలెంట్ అయ్యారనే ప్రచారం జరుగుతుంది . అయితే పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యేకించి సత్తుపల్లి అశ్వారావుపేట నియోజకవర్గాల్లో జరిగే ఆత్మీయ సమ్మేళనాలలో పాల్గొంటున్నారు .

తుమ్మల సైలెంట్ వెనక ఎదో వ్యూహం ఉండవచ్చునని అందుకే సైలెంట్ అయ్యారని పరిశీలకుల భావన … పాలేరు లో పోటీచేయాలని గట్టి పట్టుదలతో ఉన్న తుమ్మల ఆ సీటు సిపిఎం కు ఇస్తారనే ప్రచారం జరుగుతుండడటండి . సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తమ్మినేని మాటలు అందుకు బలం చేకూర్చుతున్నాయి. అంతే కాకుండా సిపిఎం పోటీలో ఉంటె ఆయన అభ్యర్థి అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇటీవల నియోజకవర్గంలో ఆయన గ్రామాలను సందర్శిస్తున్నారు. బీఆర్ యస్ కు చెందిన తాజా ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో తానే పోటీచేస్తానని గట్టినమ్మకం తో ఉండటం అందుకు అనుగుణంగా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టడంతో ఆయన పోటీ ఖాయమని బీఆర్ యస్ శ్రేణులు నమ్ముతున్నాయి. అయితే కందాల , తమ్మినేని నేనంటే నేనే అంటున్న పరిస్థితుల్లో షర్మిల పోటీలో ఉంటె తుమ్మల అయితేనే గట్టి పోటీ ఇవ్వగలరని ఆయన అనుయాయులు ప్రచారం చేస్తున్నారు . ఎన్నికలకు మరి కొద్దీ నెలలే ఉన్నాయి. గులాబీ బాస్ మాత్రం అందరిని ప్రచారం చేసుకోమని అంటున్నారు కానీ చివరకి అభ్యర్థి ఎవరిని ప్రకటిస్తారోననే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సిపిఎం కు ఇచ్చిన లేక బీఆర్ యస్ పోటీ చేసిన ఆలస్యం చేయకుండా క్లారిటీ ఇస్తేనే ఉపయోగమని పరిశీలకుల అభిప్రాయం….చూద్దాం ఏమి జరుగుతుందో….

Related posts

చైనాను వెన‌క్కు త‌గ్గేలా చేసిన భార‌త్‌.. కీల‌క ప్రాజెక్ట్ నిలిపివేత‌!

Drukpadam

చంద్రబాబు నిర్ణయంపై తమ్ముళ్ల తిరుగుబాటు…

Drukpadam

కేసీఆర్ జాతీయ పార్టీ …భారతీయ రాష్ట్ర సమితి పై అసక్తి!

Drukpadam

Leave a Comment