Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రజాసమస్యలే మా ఎజెండా …అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే కమ్యూనిస్టుల లక్ష్యం …కూనంనేని

ప్రజాసమస్యలే మా ఎజెండా …అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే కమ్యూనిస్టుల లక్ష్యం …కూనంనేని
-పొత్తులు ఇంకా ఫైనల్ కాలేదు …బీజేపీ అడ్డుకునేందుకే బీఆర్ యస్ తో చెలిమి
-గౌరవప్రదమైన పొత్తు కోసం సిపిఐ , సిపిఎం ఒకే గొంతుకగా నిలుస్తాం
-రాష్ట్రంలో సమస్యలపై రెండు కమ్యూనిస్ట్ పార్టీలు సీఎం ను కలుస్తాయి
-డబ్బుబలం కాదు ప్రజాబలంతోనే గెలుపు సాధ్యం
-డబ్బు ఉందని వీర్రవీగితే తగిన మూల్యం చెల్లించక తప్పదు …
-గోద్రా అల్లర్ల ఆరోపణలు ఎదుర్కొన్న అమిత్ షా కేంద్ర హోమ్ అయ్యారు
-వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ప్రతిపక్షాలను అణగదొక్కుతున్నారు
-రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం దారుణం
-అమర్త్య సేన్ కి ఇచ్చిన స్థలాన్ని వెనక్కు తీసుకోవడం బీజేపీ వికృత చేష్టలకు నిదర్శనం

ప్రజాసమస్యలే తమ ప్రధాన ఎజెండా …ఈసారి అసెంబ్లీ లోకి అడుగు పెట్టడమే తమ లక్ష్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు .శుక్రవారం ఖమ్మం జిల్లా సిపిఐ జిల్లా కార్యాలయం గిరిప్రసాద్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న బీఆర్ యస్ తో కలిసి ఎన్నికల్లో పోటీచేయాలని సిపిఐ ,సిపిఎం పార్టీలు నిర్ణయించుకున్నప్పటికీ ఇంకా పొత్తులు ఫైనల్ కాలేదని తెలిపారు .పొత్తులు గౌరప్రదంగా ఉండాలని రెండు పార్టీలు కొరుకుంటున్నాయని అందుకు అనుగుణంగా తాము బలమున్న స్థానాల్లో పోటీచేస్తామని తెలిపారు . ఇప్పటికే బలమైన స్థానాలను గుర్తించామని , 40 నుంచి 50 స్థానాల్లో తమకు బలమైన క్యాడర్ , శాఖలు ఉన్నాయని అన్నారు . చర్చలు , పొత్తులు, ఉభయలకు ఆమోదయోగ్యంగా ఉండాలని తాము భావిస్తున్నామని అన్నారు . పొత్తులు ఉన్నంత మాత్రాన ప్రజాసమస్యలపై తమ పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు . ప్రజా సమస్యలపై రెండు పార్టీలు సీఎం అపాయింట్మెంట్ తీసుకోని కలుస్తామని అందులో ప్రధానమైనది పోడుభూములు కాగా , రెండవది వి ఆర్ ఓ ల రెగ్యూలరైజేషన్ , మూడవది ధరణి సమస్యలపై చర్చిస్తామన్నారు . సీఎం నుంచి సానుకూలమైన నిర్ణయాలు ఉంటాయని ఆశిస్తున్నామని లేకపోతె పోరుబాట తప్పదన్నారు .

కమ్యూనిస్టులంగా తమకు ప్రజలు,దేశ ప్రయోజనాలే ముఖ్యమని అందుకు రాజీలేని పోరాటాలు మొదటి నుంచి నిర్వహిస్తున్నామన్నారు . తెలంగాణలో నాటి సాయిధ రైతాంగ పోరాటం నుంచి నేటి వరకు భూమి భుక్తి , విముక్తి కోసం అనేకమంది కమ్యూనిస్టులు బలైయ్యారని వారి త్యాగాల ఫలితంగానే నైజం సర్కార్ నుంచి తెలంగాణ విముక్తి చెందిన విషయాన్నీ మర్చి పోరాదని గుర్తు చేశారు .

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన సొంత ఎజెండాతో ప్రతిపక్షాలను అణగదొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తుందని ధ్వజమెత్తారు . గుజరాత్ మోడల్ అంటూ దేశాన్ని అదోగతిపాలు చేస్తున్న బీజేపీ ని అధికారంలోకి రాకుండా నిరోధించడమే కమ్యూనిస్టుల ముందున్న కర్తవ్యం అని అన్నారు . గోద్రా అల్లర్లకు కారణమైన వారు శుద్ధులు చెప్పడంపై సాంబశివరావు మండిపడ్డారు .అందుకు ఆరోపణలు ఎదుర్కొన్న అమిత్ షా కేంద్ర హోమ్ మంత్రి అవ్వడం సిగ్గు చేటన్నారు . విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తిరిగి రప్పిస్తామని , ప్రతి వ్యక్తి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తామని , ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన మోడీ చేసిన వాగ్దానాలు విస్మరించడమే కాకుండా , దేశాన్ని అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు . భిన్నత్వంలో ఏకత్వంగా ఉండి అన్నదమ్ముల్లా జీవిస్తున్న ప్రజలను మతంపేరుతో ప్రాంతం పేరుతో కులాల పేరుతో విడగొట్టడమే మోడీ ప్రభుత్వం చేసింది తప్ప ప్రజలకు మేలు చేసిందేమీలేదని విమర్శలు గుప్పించారు.

బీజేపీ విధానాలపై విమర్శలు చేస్తున్నారని రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని కోర్ట్ తీర్పు సాకుతో రద్దు చేయడం దారుమని అన్నారు . మోడీ దేశాన్ని అంబానీ ,ఆదానీలకు ఒప్పగించేందుకే అన్నిటిని ప్రవేట్ పరం చేస్తున్నారని మోడీ విధానాలను తప్పు పట్టారు . విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అందులో భాగమేనని విమర్శించారు . నోబుల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ కు ఇచ్చిన ల్యాండ్ ను తిరిగి వెనక్కు తీసుకున్న కేంద్ర చర్యలు దుర్మార్గమని విమర్శించారు. విలేకర్ల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ , జిల్లా నాయకులు ఎర్ర బాబు ,ఏపూరి లతాదేవి ,కొండపర్తి గోవిందరావు , శివరామకృష్ణ లు పాల్గొన్నారు …

 

Related posts

తామర, గులాబీలు పార్టీలు ప్రజలను పీల్చిపిప్పి చేస్తుండ్రు: సీఎల్పీ నేత భట్టి!

Drukpadam

సోము వీర్రాజును ఇకపై ‘సారాయి వీర్రాజు’ అని పిలవాలేమో…సీపీఐ రామకృష్ణ!

Drukpadam

కేసీఆర్ పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు….

Drukpadam

Leave a Comment