Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్ కు సీబీఐ నోటీసులు…

జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్ కు సీబీఐ నోటీసులు…

  • ఇన్సూరెన్స్ స్కామ్ కు సంబంధించి నోటీసులు ఇచ్చిన సీబీఐ
  • ఏప్రిల్ 27 నుండి 29 మధ్య అందుబాటులో ఉంటానని సత్యపాల్ మాలిక్ వెల్లడి
  • తాను సత్యం పక్షాన నిలబడతానని చెప్పిన మాజీ గవర్నర్

జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఇన్సూరెన్స్ స్కామ్ కు సంబంధించి నోటీసులు అందినట్లు అధికారులు వెల్లడించారు.

సీబీఐ నోటీసులు జారీ చేయడంపై సత్యపాల్ మాలిక్ కూడా స్పందించారు. కచ్చితమైన వివరణల కోసం ఢిల్లీలోని అక్బర్ రోడ్ లో ఉన్న సీబీఐ గెస్ట్‌హౌస్‌లో తాను హాజరు కావాలని సీబీఐ సూచించిందని పీటీఐ వార్తా సంస్థతో మాలిక్ తెలిపారు. తాను రాజస్థాన్ వెళుతున్నాను కాబట్టి అందుబాటులో ఉన్నప్పుడు ఏప్రిల్ 27 నుండి 29 మధ్య హాజరు కాగలనని వారికి చెప్పానని తెలిపారు.

తాను సత్యం పక్షాన నిలబడతానని ట్విట్టర్ వేదికగా సత్యపాల్ వెళుతున్నాను. తాను నిజం మాట్లాడి కొంతమంది చేసిన పాపాలను బయటపెట్టానని, బహుశా అందుకే ఈ నోటీసులు వచ్చాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు. తాను రైతు కుమారుడిని, భయాందోళన చెందనన్నారు. తాను నిజం కోసమే నిలబడతానన్నారు.

Related posts

అకాల వర్షాలపై అధికారులతో సీఎం కేసీఆర్  సమీక్ష…!

Drukpadam

Jennifer Lopez Nailed the Metallic Shoe Trend Again on a Date

Drukpadam

భారత్ రాఫెల్ కు పోటీగా… చైనా నుంచి జే-10సీ యుద్ధ విమానాలను అందుకున్న పాకిస్థాన్!

Drukpadam

Leave a Comment