Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అకాల వర్షాలపై అధికారులతో సీఎం కేసీఆర్  సమీక్ష…!

అకాల వర్షాలపై అధికారులతో సీఎం కేసీఆర్  సమీక్ష…!

  • పంట నష్టాన్ని అంచనా వేయాలంటూ కలెక్టర్లకు సూచన
  • కలెక్టర్లతో మాట్లాడి నివేదికలు తెప్పించాలని సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు
  • ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకుంటామని కేసీఆర్ వెల్లడి

అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న పంటలపై అధికారులతో ఆయన ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈదురుగాలులు, వడగండ్ల వానలకు జరిగిన పంట నష్టంపై అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. చేతికి అంది వచ్చిన పంటను కోల్పోయిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అకాల వర్షాల వలన కలిగిన పంట నష్టానికి సంబంధించి అంచనాలు తయారుచేయాలంటూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారికి ఆదేశాలను జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పంట నష్టానికి సంబంధించిన నివేదికలను తెప్పించాలని సీఎం కేసీఆర్ ప్రధాన కార్యదర్శికి సూచించారు.

Related posts

పోడుభూముల సాగుదార్లకు ప్రభుత్వం రక్షణ : మంత్రి పువ్వాడ అజయ్!

Drukpadam

మోహన్ బాబుకు లక్ష జరిమానా…

Drukpadam

భారీగా పెరగనున్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం!

Drukpadam

Leave a Comment