Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలురాజకీయ వార్తలు

కర్ఫ్యూ వేళ ఎంపీ గింపి జాన్తా నహి :రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు…

కర్ఫ్యూ వేళ ఎంపీ గింపి జాన్తా నహి :రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
పేదవాడి ఆకలిపై రాజకీయాలు చేస్తారా?: రేవంత్ రెడ్డి ఆగ్రహం
-లాక్ డౌన్ లో బయట కనిపించిన రేవంత్ రెడ్డి: అడ్డుకున్న పోలీసులు
-బేగంపేట వద్ద ఆపేసిన పోలీసులు:పోలీసులతో వాగ్వివాదం
-పేదలకు పట్టెడన్నం పెట్టడం నేరమా అంటూ రేవంత్ ఆక్రోశం
-ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని విమర్శలు
తెలంగాణాలో సంచలన రాజకీయనాయకుడిగా పేరున్న కాంగ్రెస్ కు చెందిన మల్కాజిగిరి ఎంపీ రేవంతరెడ్డి కరోనా భాదితులకు అన్నదానం చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు సిద్దమైన ఆయన తన వాహనంలో సికింద్రాబాద్ కు బయలుదేరారు . బేగంపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మీరు ప్రయాణించేందుకు పర్మిషన్ లేదన్నారు. తాను ఒక బాధ్యతగల ఎంపీ నని కరోనా భాదితులకు అందుతున్న సహాయం గురించి తెలుసుకునేందుకు వెళుతున్నానని చెప్పినప్పటికీ వినలేదు . కర్ఫ్యూ వేళ ఎంపీ గింపి జాన్తా నహి అన్నారు . పైగా మా పై అధికారుల పర్మిషన్ లేనిది మేము ఏమి చేయలేమని పర్మిషన్ కోసం పాస్ ఉండాల్సిందే అన్నారు. పైగా జనరేటర్ అంద జేయాలన్న , కరోనా భాదితులకు వారు కోసం వచ్చిన వారు లాక్ డౌన్ లో అన్నం లేక అల్లాడుతున్నారని చెప్పిన పోలీసులు వినిపించుకోలేదు. తనకు జరిగిన చేదు అనుభవం పై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు పట్టెడన్నం పెట్టేందుకు వెళుతుంటే తన వాహనాన్ని ఆపారని మండిపడ్డారు. ప్రభుత్వ అమానవీయ చర్యలు పరాకాష్టకు చేరుకున్నాయని అన్నారు. కంటోన్మెంట్ ఏరియాలో కొవిడ్ కేంద్రంగా మార్చిన ఓ ఆసుపత్రి వద్ద జరుగుతున్న పనులను కూడా తాను పర్యవేక్షించాల్సి ఉందని వివరించారు.
తెలంగాణ‌లో క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బేగంపేట‌లో రేవంత్ రెడ్డి ఉండ‌డాన్ని చూసిన పోలీసులు ఆయ‌న‌ను అడ్డుకున్నారు. లాక్‌డౌన్‌లో ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి లేద‌ని చెప్పారు.

అయితే, తాను కంటోన్మెంట్ ఆసుప‌త్రికి జ‌న‌రేట‌ర్ ఇచ్చేందుకు వెళుతున్నాన‌ని పోలీసు
లాక్ డౌన్ సమయంలో బయట తిరుగుతున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని హైదరాబాదు బేగంపేట వద్ద పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ల‌కు రేవంత్ రెడ్డి తెలిపారు. అయిన‌ప్ప‌టికీ, లాక్‌డౌన్ స‌మ‌యంలో తిరిగేందుకు అనుమ‌తి లేదంటూ పోలీసులు వాదించారు. తాను సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటుంటే త‌న బండిని రోడ్డు మీదే ఆపేయ‌డ‌మేంట‌ని రేవంత్ రెడ్డి నిల‌దీశారు. దీంతో పోలీసు ఉన్న‌తాధికారుల‌తో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. పేదవాడి ఆకలిపై రాజకీయాలు చేస్తారా? నన్ను ఆపడం అంటే గరీబోడి నోటికాడ కూడు లాగేసే ప్రయత్నమే అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. సామాజిక సేవలోనూ రాజకీయాలు వెతికే ప్రయత్నం దుర్మార్గం అని విమర్శించారు. పై అధికారులు కూడా రేవంత్ రెడ్డి బయట తిరగటాన్ని తప్పు పట్టారు.

 

 

Related posts

తన హత్యకు కుట్ర జరుగుతోంది: రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణ!

Drukpadam

దొంగతనం నేరం మోపి దళిత బాలికను చిత్రహింసలు పెట్టిన కుటుంబం!

Drukpadam

ఈటల పై తెలంగాణ మంత్రుల ఎదురు దాడి…

Drukpadam

Leave a Comment