ఖమ్మం వార్తలు

కోమటిరెడ్డి నివాసంలో ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేల సమావేశం…

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు సమావేశం ఆదివారం జరిగింది …ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి మరియు జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు….జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు …శాసనసభ బడ్జెట్ సమావేశంలో ప్రస్తావించాల్సిన జిల్లా సమస్యలను ,తమ తమ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేలు ప్రస్తావించారు …అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిసింది …ప్రధానంగా మంత్రులు ఉన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్న తమ నియోజకవర్గాల్లో నిధులు లేక జరగడంలేదని ఎమ్మెల్యేలు అన్నట్లు సమాచారం…

వేసవిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో తాగునీరు, సాగునీరు, విద్యుత్ వంటి అంశాలపై జిల్లా ప్రజాప్రతినిధులతో మంత్రులు చర్చలు జరిపారు ..జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఈ సమావేశంలో చర్చజరిగిందని తెలుస్తుంది …

Related posts

పాలేరు ,ఖమ్మంలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి …తుమ్మల , పొంగులేటి

Ram Narayana

మిచౌంగ్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి…పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి

Ram Narayana

రౌడీయిజం ,గుండాయిజం ,రాజకీయ హత్యలు గురించి తుమ్మల మాట్లాడటం హాస్యాస్పదం ..మంత్రి పువ్వాడ కౌంటర్ ఎటాక్ ….

Ram Narayana