ఖమ్మం వార్తలు

మిచౌంగ్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి…పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి

మిచౌంగ్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి

  • ఉమ్మడి జిల్లా ప్రజలకు పొంగులేటి శీనన్న సూచన
  • ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లకు, సీపీకి ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా

ఖమ్మం: మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్, పాలేరు అసెంబ్లీ విజేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా, ఖమ్మం కలెక్టర్ వీపీ. గౌతమ్, సీపీ విష్ణు ఎస్.వారియర్ కు ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువుల వెంబడి వరద తాకిడితో ఎలాంటి నష్టం జరగకుండా అక్కడి అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లా అధికారులు, సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ.. వరద సహాయక చర్యలను చేపట్టాలని అన్నారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఖ్య పెంచుకుని.. మెరుగైన సేవలు అందేలా చూడాలని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ప్రతిఒక్కరినీ అప్రమత్తం చేయాలని కోరారు.

Related posts

ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంపై తిరుగుబాటు …

Ram Narayana

సుందరనగరంగా ఖమ్మం …2025 లో లక్ష్యాలు నిర్దేశించుకున్న …మంత్రి తుమ్మల

Ram Narayana

సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ హఠాన్మరణం …

Ram Narayana