తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉండండి !!
మాజి మంత్రి,ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు,ప్రజలకు సూచన…
మిచౌంగ్ తుపాన్ నేపథ్యంలో వుమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు,ఎస్పీలు, వున్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి,ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు గారు సూచించారు…
ముఖ్యంగా వుమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతం అవడం వలన తుపాన్ ప్రభావం ఎక్కువగా వుండే అవకాశం ఉన్నందున ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని,సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా,రైతుల పంటలు తడిచి అధిక నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలని రెండు జిల్లాల కలెక్టర్లకు సూచించారు….
అదేవిధంగా అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు,రోడ్లపై ఎక్కడ లారీలు నిలుపుదల చెయ్యనివ్వొద్దని పోలీసు అధికారులకు సూచించారు,సామాన్య ప్రజలకు ఏటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు జారీ చేశారు
Save or share this story as a newspaper-style Epaper Clip: