Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

రఘురామకు వైద్య పరీక్షలు పూర్తి… గుంటూరు జిల్లా జైలుకు తరలింపు…

రఘురామకు వైద్య పరీక్షలు పూర్తి… గుంటూరు జిల్లా జైలుకు తరలింపు
-జిల్లా కోర్టులో వైద్య నివేదిక సమర్పణ
-రెండ్రోజుల కిందట రఘురామకృష్ణరాజు అరెస్ట్
-కులాల మధ్య ఉద్రిక్తతల రేకెత్తిస్తున్నాడంటూ ఆరోపణలు
-ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నాడని అభియోగాలు
-నేడు గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
-నివేదిక రూపొందించిన మెడికల్ బోర్డు

కోర్టు ఆదేశాల మేరకు ఎంపీ రఘురామకృష్ణరాజుకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయననకు అన్ని రకాల వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం రఘురామను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. కోర్టు ఆయనను రమేశ్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ, పోలీసులు జిల్లా జైలుకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, రఘురామకు నిర్వహించిన వైద్య పరీక్షలపై మెడికల్ బోర్డు నివేదిక రూపొందించింది. ఈ నివేదికను జిల్లా కోర్టులో సమర్పించారు. రఘురామను జిల్లా జైలుకు తీసుకువచ్చిన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రఘురామకు కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

 

 రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ కేంద్ర హోంశాఖకు 12 పేజీల లేఖ.

 

తన తండ్రి రఘురామకృష్ణరాజును అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆయన తనయుడు కనుమూరి భరత్ ఆక్రోశిస్తున్నారు. ఈ క్రమంలో భరత్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. పోలీస్ కస్టడీలో తన తండ్రిని చిత్రహింసలకు గురిచేశారని భరత్ తన లేఖలో ఆరోపించారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. భరత్ తన లేఖతో పాటు రఘురామ కాలి గాయాల ఫొటోలను కూడా జోడించారు.

ఏపీలో భారత రాజ్యాంగం అమలు కావడం లేదని, రాష్ట్రంలో అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వెలిబుచ్చారు. తన తండ్రిని ఏపీ సీఐడీ అధికారి సునీల్ కుమార్ బృందం ఈ నెల 14న అదుపులోకి తీసుకుందని, విచారణ పేరుతో రాత్రంతా హింసించారని భరత్ వెల్లడించారు. ఓ ఎంపీ అని కూడా పట్టించుకోకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు.

పోలీసుల దెబ్బలకు ఆయన శరీరంపై గాయాలు తగిలాయని, సరిగా నడవలేని స్థితిలో ఉన్నారని వివరించారు. అవి కొట్టడం వల్ల ఏర్పడిన దెబ్బలే అయితే కఠినచర్యలు తప్పవని కోర్టు కూడా పోలీసులను హెచ్చరించిన విషయాన్ని భరత్ తన లేఖలో ప్రస్తావించారు. చట్టాలు, రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించరాదని తన లేఖలో కోరారు.

Related posts

రఘురామ అరెస్ట్ తీరు, తదనంతర పరిణామాలపై ఎన్ హెచ్ఆర్ సీ నోటీసులు…

Drukpadam

క‌డ‌ప ఎంపీ టికెట్ ష‌ర్మిల లేక విజ‌య‌మ్మ‌కు ఇవ్వాల‌ని వివేకా కోరారు:ప్ర‌తాప్ రెడ్డి

Drukpadam

బాబా సిద్దిఖీ హత్యకేసు నిందితుడు బాలుడు కాదు.. తేల్చేసిన బోన్ అసిఫికేషన్ టెస్ట్

Ram Narayana

Leave a Comment