Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమెరికన్ ఎయిర్‌‌లైన్స్ విమానంలో భారతీయుడి అసభ్యకర ప్రవర్తన.. అరెస్ట్

అమెరికన్ ఎయిర్‌‌లైన్స్ విమానంలో భారతీయుడి అసభ్యకర ప్రవర్తన.. అరెస్ట్

  • మద్యం మత్తులో తోటి ప్రయాణికుడితో నిందితుడి వాగ్వాదం, మూత్ర విసర్జన
  • ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులకు విమాన సిబ్బంది ఫిర్యాదు 
  • విమానం ల్యాండవగానే నిందితుడి అరెస్ట్
  • బాధితుడి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు

న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఆదివారం ఓ భారతీయుడు అసభ్యకరమైన చర్యకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో తోటి ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగి, అతడిపై మూత్ర విసర్జన చేశాడు. దీంతో, ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఈ ఘటనకు సంబంధించి విమాన సిబ్బంది తొలుత ఇతర ప్రయాణికుల వాంగ్మూలాన్ని తీసుకుని, ఆపై ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం అందించారు. అనంతరం, విమానం ఢిల్లీలో దిగాక నిందితుడిని సీఐఎస్ఎఫ్ పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సివిల్ ఏవియేషన్ చట్టం కింద  నిందితుడిపై చర్యలు ప్రారంభించామని ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, బాధితుడు మినహా అతడిపై ఇతర ప్రయాణికులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి. గతేడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు డభ్బై ఏళ్ల వయసున్న తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఆ తరువాత డిసెంబర్ 26న ప్యారిస్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు తన తోటి ప్రయాణికురాలి సీటుపై మూత్ర విసర్జన చేశాడు.

Related posts

Drukpadam

మంచు తో కప్పు బడ్డ కెనడా

Drukpadam

బిగ్ బాస్ ఓ బ్రోతల్‌ స్వర్గం-నారాయణ కలకలం : ముద్దులు-డేటింగ్ : జగన్ మంచి నిర్ణయం..!!

Drukpadam

Leave a Comment