Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

చైనా నుంచి తెలంగాణ‌కు 200 ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు..

చైనా నుంచి తెలంగాణ‌కు 200 ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు..
– కేటీఆర్‌కు అందించిన గ్రీన్ కో
-వాటిని దిగుమ‌తి చేసిన గ్రీన్ కో సంస్థ
-గ్రీన్ కో సంస్థ‌కు కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు
-క‌రోనా క‌ట్ట‌డికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నాం
-ఇత‌ర రాష్ట్రాల క‌రోనా రోగుల‌కు కూడా చికిత్స: కేటీఆర్
చైనా నుంచి కార్గో విమానంలో తెలంగాణ‌ రాష్ట్రానికి 200 ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు అందాయి. వాటిని దిగుమ‌తి చేసిన గ్రీన్ కో సంస్థ ప్ర‌తినిధులు తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అందించారు. దీంతో గ్రీన్ కో సంస్థ‌కు కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ… క‌రోనా క‌ట్ట‌డికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. ఇప్పటికే ఇజంక్షన్ ల కొరతను అధికమించమని ఆక్సిజన్ లిక్విడ్ ఉన్న దాని మార్చే పరికరాల కొరత రాపాడింది. గ్రీనుకో సహాయంతో అదికూడా తీరిందని అన్నారు. తెలంగాణాలో కరోనా రోగులకు మైరుగైన చికిత్స అందించటంలో ముందున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. కావలసిన బెడ్స్ , ఆక్సిజన్, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఈ విష‌యంలో తెలంగాణ‌లో నిధుల కొర‌త లేదని కేటీఆర్ తెలిపారు. ఇత‌ర రాష్ట్రాల క‌రోనా రోగుల‌కు కూడా తెలంగాణ‌లో చికిత్స అందుతోంద‌ని ఆయ‌న చెప్పారు. ఔష‌ధాలు, ఆక్సిజ‌న్, ఇత‌ర వైద్య ప‌రికరాలు అందించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరామ‌ని ఆయ‌న తెలిపారు. దీంతో కేంద్ర స‌ర్కారు సానుకూలంగా స్పందించిందని వివ‌రించారు.

Related posts

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పనిచేస్తున్న వారికీ కరోనా వ్యాక్సిన్ అందించాలి…

Drukpadam

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత‌కు క‌రోనా పాజిటివ్‌…

Drukpadam

తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సు సర్వీసులను నిలిపివేసిన టీఎస్‌ఆర్టీసీ!

Drukpadam

Leave a Comment