Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మోదీ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు, గుజరాత్ హైకోర్టుకు రాహుల్ గాంధీ..!

మోదీ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు, గుజరాత్ హైకోర్టుకు రాహుల్ గాంధీ..!

  • మోదీ ఇంటి పేరును అవమానించారనే పరువు నష్టం కేసులో పైకోర్టుకు రాహుల్
  • తనకు విధించిన శిక్షను వాయిదా వేయాలన్న అభ్యర్థనను తిరస్కరించడంతో అప్పీల్
  • 2019లో మోదీ ఇంటి పేరుపై కాంగ్రెస్ అగ్రనేత వ్యాఖ్యలు

మోదీ ఇంటి పేరును అవమానించారనే పరువు నష్టం దావా కేసులో శిక్ష పడిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మంగళవారం గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో తనకు విధించిన శిక్షను వాయిదా వేయాలన్న తన అభ్యర్థనను దిగువ కోర్టు తిరస్కరించడంతో రాహుల్ పై కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. 2019లో కర్నాటకలోని కోలార్ లో మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చి, రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో గత నెలలో లోక్ సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో రాహుల్ శనివారం తన అధికారిక బంగ్లాను కూడా ఖాళీ చేశారు.

దొంగలందరికీ మోదీ అనే కామన్ పేరు ఎలా వచ్చింది అని ఆయన చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు కోర్టు జైలు శిక్ష విధించింది. దీనిని కోర్టులో సవాల్ చేసేందుకు ముప్పై రోజుల సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. తన రెండేళ్ల శిక్షను నిలిపివేయాలని, తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఏప్రిల్ 3న విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణలో భాగంగా ఏప్రిల్ 13న ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు పిటిషన్లను తిరస్కరించింది. దీంతో రాహుల్ హైకోర్టుకు వెళ్లారు.

Related posts

Inside Martina, a Shake Shack-Like Approach to Pizza

Drukpadam

ఆఫ్ఘన్ల సాయుధ పోరాటం: 4 జిల్లాలు తాలిబన్ల నుంచి తిరిగి స్వాధీనం!

Drukpadam

ఏపీ సీఎం జగన్ ను పొంగులేటి ఎందుకు కలిశారంటే ….

Drukpadam

Leave a Comment