ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి జగన్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లో సాంకేతిక లోపం!

ముఖ్యమంత్రి జగన్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లో సాంకేతిక లోపం!

  • గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకున్న సీఎం
  • అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో నార్పలకు జగన్
  • తిరుగు ప్రయాణంలో సాంకేతిక లోపం గుర్తించిన అధికారులు

అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. నార్పల నుండి పుట్టపర్తికి హెలికాప్టర్ లో జగన్ వెళ్లవలసి ఉంది. అయితే సాంకేతిక లోపం తలెత్తడంతో రోడ్డు మార్గాన పుట్టపర్తికి బయలుదేరారు. జగన్ ఉదయం గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకున్నారు. అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో నార్పలకు వెళ్లారు. నార్పల నుండి తిరిగి పుట్టపర్తి వెళ్లే సమయంలో మాత్రం హెలికాప్టర్ లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో తిరుగు ప్రయాణంలో రోడ్డు మార్గంలో వెళ్లారు. జగన్ ప్రత్యేక విమానం లేదా హెలికాప్టర్ లలో గతంలోను రెండుమూడుసార్లు సాంకేతిక లోపాలు తలెత్తాయి.

Related posts

తుళ్లూరు పోలీసుల‌ కస్టడీకి జర్నలిస్ట్ కృష్ణంరాజు .. మూడు రోజుల విచారణ

Ram Narayana

అమరావతిలో లాండ్ పూలింగ్ మళ్లీ షురూ.. భూములిచ్చేందుకు రైతుల ఉత్సాహం!

Ram Narayana

అమిత్ షా ఫోన్ చేస్తే ఒక్కటే చెప్పా.. చంద్రబాబు

Ram Narayana