Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన మహిళానేత… జడ్పీటిసి పదవికి రాజీనామా!

బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన మహిళానేత… జడ్పీటిసి పదవికి రాజీనామా!
-కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు అమలు కావడంలేదని విమర్శ
-స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని ధ్వజం ..
-పేపర్ల లీకులు విద్యార్థులను , నిరుద్యోగులని బజారున పడేశాయని ఆవేదన

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం స్థానిక జడ్పీటీసీ అధికార బీఆర్ ఎస్ పార్టీ కి భారీ షాక్ ఇచ్చింది. గార్ల మండలం మర్రిగూడెం గ్రామపంచాయతీ చెందిన గార్ల జడ్పీటీసీ జాటోత్ ఝాన్సీ బీఆర్ఎస్ పార్టీకి బుధవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేసిన పనులు కావడం లేదని, గార్ల -రాంపురం హై లెవెల్ బ్రిడ్జి, కేసీఆర్ ఎన్నో హామీలు ఇస్తూ బంగారు తెలంగాణ సాధించుకుంటామని,స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి, నిధులు ఇవ్వకుండా ఎక్కడ తిరగని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు,మన తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1 పేపర్ ను లీక్ చేయడం జరిగిందని, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పిల్లలు అనేకమంది కోచింగ్ తీసుకుని మోసపోతున్నారని, రాష్ట్రంలో బతికేటటువంటి పరిస్థితి లేదని, రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ కీ ప్రజలే బుద్ధి చెప్తారని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రాజీనామా చేస్తున్నట్లు ఆమె చెప్పారు.

Related posts

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి దూరమైన కేటీఆర్…

Drukpadam

ఈటల చుట్టూ తెలంగాణ రాజకీయం …శంషాబాద్ లో అభిమానుల హడావుడి…

Drukpadam

కేంద్రంపై ప్రతిపక్ష ముఖ్యమంత్రుల తిరుగుబాటు లేఖ..

Drukpadam

Leave a Comment