Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు గౌరవప్రదంగా ఉండాలి…

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు గౌరవప్రదంగా ఉండాలి…
-బీఆర్ యస్ , సిపిఎం ,సిపిఐ ఐక్యతతో ముందుకు సాగాలి
-పెచ్చరిల్లుతున్న బీజేపీ మతోన్మాదానికి అడ్డుకట్ట వేయాలి
-ఐక్యంగా బి.జె.పి.ని ఓడిద్దాం.,,
-సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

కేంద్రంలో పాలన కొససాగిస్తున్న బిజెపి మతోన్మాద రాజకీయాలు చేస్తూ దేశంలో శాంతియుతంగా, సామరస్యంగా వున్న ప్రజల మధ్య చిచ్చు పెడుతూ, మత ఘర్షణలు సృష్టిస్తూ దేశ సమైక్యతకు భంగం కల్పిస్తూ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టాలని అడ్డగోలు దారులు తొక్కుతూ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్న బిజెపి ని ఓడించేందుకు వామపక్ష, లౌకిక శక్తులు ఐక్యంగా పోరాడాలని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ, బిఆర్‌ఎస్‌ సీట్ల సర్ధుబాటు గౌరప్రదంగా వుంటూ ఐక్యతతో బిజెపి కుట్రలను తిప్పికొట్టే విధంగా పనిచేయాలని సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు.
బుధవారం ఖమ్మం సుందరయ్య భవనంలో పార్టీ జిల్లా కార్యదర్శి వై.విక్రం అధ్యతన జరిగిన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసిన బిజెపి ఏ ఒక్క వాగ్దానం అమలు చేయకుండా కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు యిస్తామని చెప్పి, యింత వరకు అమలు చేయకుండా నిరుద్యోగులకు మొండిచేయి చూపించిందని విమర్శించారు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పి వాటిని అమలు చేయకుండా మరింతగా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటే విధంగా ధరలు పెంచారని అన్నారు. దీని కారణంగా ప్రజల జీవన పరిస్థితులు దుర్భరమవుతున్నాయి. మరోవైపు రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని, రాష్ట్రాల అభివృద్ధికి నిధులను మంజూరు చేయకుండా గవర్నర్‌ ద్వారా బిల్లు పాసు కాకుండా అడ్డుకుంటుందని విమర్శించారు.

రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి బిజెపి రావాలని అనేక తప్పుడు మార్గాల ద్వారా బిజెపి ప్రయత్నిస్తుందని తెలిపారు. ఇలాంటి సమయంలో బిజెపికి వ్యతిరేకంగా లౌకిక శక్తుల ఐక్యత చాలా అవసరమని అన్నారు. మత సామరస్యానికి వేదికగా వున్న తెలంగాణ రాష్ట్రంలో పోరాటాలకు స్ఫూర్తిగా వున్న తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి చోటివ్వకుండా రాబోయే ఎన్నికల్లో బిజెపిని చిత్తు చిత్తుగా ఓడిరచి గుణపాఠం నేర్పాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకోసం సిపిఎం పార్టీ వామపక్ష పార్టీలు యిప్పటికే జిల్లాలో కృషి చేస్తున్నాయని తెలిపారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు బిఆర్‌ఎస్‌ పార్టీతో సమగ్రంగా చర్చించి సీట్ల సర్ధుబాటు ఉంటుందని నున్నా తెలిపారు. సిపిఎం, సిపిఐ, బిఆర్‌ఎస్‌ పార్టీలు చర్చలు చేసి, పార్టీకి బలంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు పోటీచేస్తామని సర్ధుబాటులో ఏ పార్టీ ఎక్కడ నుండి పోటీ చేసినా, ఐక్యంగా ముందుకు పోతామని నున్నా తెలిపారు. బిజెపి మతోన్మాద కార్పొరేట్‌ శక్తులకు ఖమ్మం జిల్లాలో తగిన గుణపాఠం జిల్లా ప్రజలు చెబుతారని నున్నా నాగేశ్వరరావు అన్నారు.

ఈ సమావేశంలో సిపిఐ (ఎం) రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్‌, జిల్లా కమిటి సభ్యులు యర్రా శ్రీనివాసరావు, ఎం.ఎ.జబ్బార్‌, దొంగల తిరుపతిరావు నాయకులు ఎస్‌.కె.వి.ఎ. మీరా, పార్టీ మండల కార్యదర్శులు బోడపట్ల సుదర్శన్‌, భూక్యా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ మరో బెంగాల్ కానున్నదా? బీజేపీ టార్గెట్ అదేనా

Drukpadam

చంద్రబాబు కారును ఢీకొట్టిన మరో కారు.. తప్పిన ప్రమాదం!

Drukpadam

నీరవ్ మోదీ అన్నంత మాత్రాన ఆయనను సస్పెండ్ చేసేస్తారా?: మల్లికార్జున ఖర్గే

Ram Narayana

Leave a Comment