Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పాదయాత్రికుడు@550 కి ,మీ లు …భట్టి పీపుల్స్ మార్చ్ కు జననీరాజనం…!

పాదయాత్రికుడు@550 కి ,మీ లు …భట్టి పీపుల్స్ మార్చ్ కు జననీరాజనం…!
-ప్రజల సమస్యలు వింటూ …ముందుకు సాగుతున్న సీఎల్పీ నేత
-ఆకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతుల గోడు
-ఐకేపీ కేంద్రాల్లో ములుగుతున్న ధాన్యపురాసుల పరిశీలన
-కొనే దిక్కు లేక రైతుల ఆవేదన …రైతులకు న్యాయం చేయాలనీ భట్టి డిమాండ్ ..
-తెలంగాణ రాష్ట్రమొచ్చినా …ప్రజల భాదలు తీరలేదని మండిపాటు
-మార్పు కోసం …రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలని పిలుపు
-ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ప్రజలకు భట్టి హామీ

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తెలంగాణాలో చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 47 రోజులుగా నిరాటంకంగా కొనసాగుతుంది… ఇప్పటివరకు ఆయన 550 యాత్రను పూర్తీ చేశారు . ఇందిరమ్మ రాజ్యం స్థాపనే లక్ష్యంగా చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాయాత్రకు జనజాతరను తలపింపజేస్తుంది .జననిరాజం పలుకుతున్నారు . యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతుండగా , ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. పీపుల్స్ మార్చ్ కు ప్రజల నుంచి
లభిస్తున్న ఆదరణను వివిధ పార్టీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. . యాత్రికుడైన భట్టికి ప్రజలు తమ కష్టాలు తెలుపుకుంటూ ఇందిరమ్మ రాజ్యం తిరిగి రావాలని కోరుకుంటున్నారు . మంగళవారం యాదాద్రి భవనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలోని రాజుపేట మండలం లోని రఘునాథపురం గ్రామం నుంచి బయలుదేరిన యాత్ర యాదాద్రి మండలంలోని మాసాపేట గౌరాయిపల్లి , సైదాపురం గుండా రాత్రికి యాదాద్రికి చేరుకుంది. రాత్రిపూట అక్కడ బస చేయనున్నారు. తిరిగి బుధవారం ఉదయం యాదాద్రి నరసింహస్వామి ఆలయంలో భట్టి దంపతులు పూజలు నిర్వహిస్తారు . అనంతరం అక్కడ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది.

ఈసందర్భంగా ఆయాగ్రామాల్లో జరుగుతున్న సభల్లో భట్టి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మార్పు వస్తుందని ,కేసీఆర్ చెప్పినట్లు ,నీళ్లు ,నిధులు ,నియామకాలు మనకే వస్తాయని అనుకుంటే అందుకు విరుద్ధంగా కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారు . దేశానికి స్వతంత్రం తెచ్చిందెవరు ….? ప్రాజెక్టులు నిర్మించింది కాంగ్రెస్ ,పరిశ్రమలు తెచ్చింది కాంగ్రెస్, విద్యాలయాలు పెట్టింది కాంగ్రెస్ ,హాస్పటల్స్ కట్టించింది కాంగ్రెస్ ,రోడ్లు వేసింది కాంగ్రెస్… పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది కాంగ్రెస్ , అవునా ..? కదా …? అంటూ ప్రజలను ప్రశ్నించారు . ప్రజల నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ అనే సమాదానాలు రాబడుతున్నారు … గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తమ ఇళ్లకు రావాలని భట్టిపై వత్తిడి తెస్తున్నారు .సమయాన్ని బట్టి కొన్ని చోట్లు వెళ్తు మరికొన్ని చోట్ల వారిని కన్విన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు . తెలంగాణ వచ్చినా ప్రజల్లో ఎలాంటి మార్పులు జరగలేదని కేవలం ఒక్క కేసీఆర్ కుటంబంతోనే మెరుపు జరిగిందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరు కుంటున్నారని అందుకోసం రాష్ట్రప్రభుత్వాన్ని మార్చాలని పిలుపు నిచ్చారు .

44 ,45 ఉష్టోగ్రతలతో మండుతున్న ఎండలు ,ఈదురు గాలులు ,వడగళ్ల వర్షాలు వాతావరణం అనుకూలంగా లేకపోయినా మొక్కవోని దీక్షతో భట్టి యాత్రను కొనసాగించడం విశేషం …ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రజలకోసం తాను తలపెట్టిన యాత్రను కోసగించేందుకు ఆయన పడుతున్న తపన అబ్బురపరుస్తుంది. కాలినడకన సాగుతున్న పీపుల్స్ మార్చ్ లో తన వెంట అనేకమంది పాల్గొంటున్నారు. ఇది 2003 వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రను తలపింప జేస్తుందని ప్రజలు చెప్పుకుంటున్నారు. అయ్యో కొడుకు ప్రజల కోసం ఎర్రటెండలో యాత్ర చేస్తున్నాడని సానుభూతి చూపిస్తున్నారు . వర్షం లో తడుస్తుంటే కొడుకు తడుస్తున్నాడంటున్నారు.. అనేక జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యపు రాశులతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండటాన్ని గమనించిన భట్టి వారి వద్దకు వెళ్లే వారి కష్టాలను కళ్లారా చూసి తెలుసుకొని నేనున్నానని ప్రభుత్వ దృష్టికి తీసుకోని వెళ్లి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని కొనేలా వత్తిడి తెస్తానని అంటున్నారు . సుదూర యాత్రలో కళ్ళకు బొబ్బలు ,కాళ్ళవాపులు , నొప్పులు తగ్గించుకునేందుకు రోజు మధ్యాహ్నం ,సాయంత్రం మసాజ్ చేయించుకుంటున్నారు . ఈ యాత్ర ఖమ్మం జిల్లాలో జూన్ లో ముగిసే అవకాశం ఉంది . మధ్యలో మరో మూడు బహిరంగ సభలు జరుగుతాయని భట్టి తెలిపారు ..ఈ సభలకు ఏఐసీసీ అగ్రనేతలు హాజరవుతారని అనుకుంటున్నట్లు తెలిపారు .

తన యాత్రకు కావాల్సిన సరంజామా వెంట తెచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు . ప్రత్యేక బృందంతో కష్టాలను లెక్క చేయక కదులుతున్న భట్టికి రోజురోజుకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతుండటం గమనార్హం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పిప్రి నుంచి ప్రారంభమైన యాత్ర 47 రోజుల్లో 7 జిల్లాలో జయప్రదంగా నడిచింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ యాత్రకు కదులు తున్నాయి అనేకమంది నేతలు భట్టి యాత్ర కు సంఘీభావం ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ లో కింది స్థాయి నేతలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కాంగ్రెస్ దే అధికారమని భట్టి పీపుల్స్ యాత్ర ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తుంది. గతనెలలో మంచిర్యాల లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు . దానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరైయ్యారు . ఈ యాత్ర జరుగుతున్న తీరును కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సహితం ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు . యాత్రకు కలసిన ఏర్పాట్లు చేయాలనీ రాష్ట్ర పార్టీ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ , పీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డిలను ఆదేశించారు . మరికొద్ది రోజుల్లో మెడ్చర్ల లో పీపుల్స్ మార్చ్ యాత్ర సందర్భంగా బహిరంగ సభ జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

 

Related posts

ఏపీలో పరిస్థితులు దిగజారిపోయాయి…చర్యలు తీసుకోండి రాష్ట్రపతి ,ప్రధానికి చంద్రబాబు లేఖ …

Ram Narayana

కేసీఆర్ మొండి ఘటం ..ఏ ప‌ని చేప‌ట్టినా పూర్త‌య్యేదాకా వ‌ద‌ల‌రు: కేటీఆర్

Drukpadam

ప్లీజ్.. ఎన్ కౌంటర్ చేయొద్దు, జైలుకే పంపండి!

Drukpadam

Leave a Comment