Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాఘురామ కృషంరాజు కాళ్లకు తగిలినవి దెబ్బలుకాదు ఎడిమా…

రాఘురామ కృషంరాజు కాళ్లకు తగిలినవి దెబ్బలుకాదు ఎడిమా…
-ఆయన ఒంటిపై ఎలాంటి దెబ్బలు లేవు
-ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేవు
-స్పష్టం చేసిన మెడికల్ రిపోర్ట్
-ఆయన్ను కొట్టారని మొత్తుకున్నా చంద్రబాబు అండ్ కో
-ఎ సి బి కోర్ట్ లో 12 పేజీల లేఖ అందజేసిన రాఘురామ
-తన భర్త ను చంపుతారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన భార్య రమాదేవి
నరసాపురం ఎంపీ రాఘురామ కృషంరాజు అరెస్టు విషయంలో ను ఆయన్న గుంటూరు లో సి ఐ డి అధికారి కార్యాలయం లో గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చి కొట్టారని చేసిన ఫిర్యాదులపై విమర్శలు ప్రతివిమర్శలు జోరందుకున్నాయి. నిజంగా ఆయన్ను కొట్టారా ? మరి ఇంత భరితెగింపా ? మనం ఎక్కడ ఉన్నాం ? ప్రజాస్వామ్య వ్యవస్థలోనా? ఆటవిక పాలనలోనా? ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు రాజ్యాంగం లేదు కేవలం రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతుందని స్వయంగా చంద్రబాబునే అంటే నిజమే అనుకున్నారు. దీనిపై స్పందించిన కోర్ట్ మెడికల్ బోర్డు కు రెఫర్ చేసింది. ఆయన దెబ్బలపై పరీక్షలు జరిపి కొట్టిన దెబ్బల కావా నిర్దారించాలని ఆదేశాలు జారీచేసింది. కోర్ట్ ఆదేశాల మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో పరీక్షలు జరిపిన డాక్టర్ల బృందం ఆయనకు దెబ్బలు తగలలేదని స్పష్టం చేసింది. అంతే కాకుండా ఆయన ఎడిమా వ్యాధితో భాదపడుతున్నారని తెలిపింది. దీనితో రాఘురామ నాటకానికి తెరపడినట్లు అయింది. ఆయన అరెస్ట్, దెబ్బల గురించి మొత్తుకున్నా రాజకీయనాయకులు మెడికల్ రిపోర్ట్ పై ఎలాంటి కామెంట్ చేస్తారనే ఆశక్తి నెలకొన్నది .

రాఘురామ వైఆర్సీపి నుంచి గెలిచిన కొద్దీ నెలల్లోనే ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం పార్టీ నిర్ణయనాలు ప్రభుత్వ నిర్ణయాలను అదే పనిగా వ్యతిరేకించడం . ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడటం ఆయనకు కులాన్ని ఆపాదించడం లాంటివి నిరంతర కార్యక్రమంగా పెట్టుకున్నారు. రచ్చబండ నిర్వహించి అందులోను ప్రతిపక్ష పార్టీలు కూడా చేయని విధంగా వైసీపీ పై ఘాటు విమర్శలు చేయడం చేశారు. ఒక బాధ్యతగల ఎంపీ తన నియోజకవర్గాన్ని వదిలి పెట్టి ఉంటె ఢిల్లీ లో లేదా హైద్రాబాద్ లో ఉంటూ కులాలను ,మాటలను రెచ్చెగొట్టే విధంగా మాట్లాడారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనే ఆంధ్రప్రదేశ్ సి ఐ డి పోలీసులు ఆయనపై రాజద్రోహం కింద కేసులు నమోదు చేశారు. ఆయన్ను హైద్రాబాద్ లో అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి ఏపీ లోని గుంటూరు సి ఐ డి కార్యాలయానికి తీసుకుని వచ్చారు. అక్కడ ఒక రోజు ఉన్న తరువాత ఎ సి బి జిల్లా కోర్ట్ కు తరలించారు.ఆయన అరెస్ట్ తెలిసిన వెంటనే ముందుగా తెలుగు దేశం స్పందించింది. రాఘురామ అరెస్ట్ అక్రమం అని ఖండించింది. చందర్బాబు అందరికన్నా ఎక్కువగా స్పందించారు. ఏపీ లో అరాచకపాలనకు రాఘురామ అరెస్ట్ పరాకాష్టగా అభివర్ణించారు. ఒక ఎంపీ ని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొని పోయి కొట్టడంపై మండి పడ్డారు. దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. బీజేపీ , సిపిఐ పార్టీలు కూడా రాఘురామ అరెస్ట్ ను ఖండించాయి. కోర్ట్ రఘరామ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన అనంతరం తనను సి ఐ డి పోలీసులు ఈపరీతంగా కొట్టారని , తాను నడవలేని పరిస్థితిలో ఉన్నానని తననకు బెయిల్ మంజూరు చేయాలనీ కోర్ట్ ను కోరారు. దెబ్బలు కొట్టారని కోర్ట్ కు 12 పేజీల లేఖను అందజేశారు. నిజముగా కొడితే దుర్మార్గం , రాక్షస పాలనే అవుతుంది. కొట్టకుండా తప్పుడు ప్రచారం చేయడం కూడా నేరమే అవుతుంది. తన దెబ్బలను కోర్ట్ లో జడ్జి కి చూపించారు. ఈ విషయం హైకోర్టు కు వెళ్ళింది. న్యాయమూర్తులు జిల్లా కోర్ట్ లోను హైకోర్టు లోను తీవ్రంగానే స్పందించారు. నిజంగా దెబ్బలు కొడితే చాల సీరియస్ పరిణామాలు ఉంటాయని ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా చేశారు. ఆయన ఒంటిపై ఉన్న దెబ్బలను పరిశీలించేందుకు ఓకే మెడికల్ ఎక్సపర్ట్ తో కూడిన టీమ్ ను కోర్ట్ ఏర్పాటు చేసింది. ఆయనకు గుంటూరు ప్రభుత్వ హాస్పటల్ లో పరీక్షలు చేశారు. చర్మ సంబంధ జబ్బులకు డార్మిటలజీ డాక్టర్ తో కూడా పరిక్షలు నిర్వయించారు. చివరకు జిల్లా ఎ సి బి కోర్ట్ కు నివేదిక అంద జేశారు. జిల్లా కోర్ట్ ప్రత్యేక మెస్సెంజర్ ద్వారా మెడికల్ రిపోర్ట్ ను హైకోర్టు కు పంపింది . అరెస్ట్ అయిన దగ్గర నుంచే రాఘురామ ఆరోగ్యం బాగాలేదని , ఇటీవలనే గుండె ఆపరేషన్ జరిగిందని రోజు మందులు వేసుకోవాలని కుటుంబ సభ్యులు తెలిపారు . అదే కుటుంబ సభ్యులు తాము మనుషులు తీసుకొని పోయిన టిఫన్ ఎ సి బి పోలీసులు తీసుకొని అందజేస్తామని చెప్పారని ఎవరిని ఆయన్ను కలిసేందుకు అనుమతించలేదని ఆయన భార్య రమాదేవి చెప్పారు. అప్పటి వరకు ఆయనకు ఏమి జరిగిందనే విషయం తెలియదని అన్నారు. అసలు ఆయన ఏమి తప్పుచేశారని అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. కోర్ట్ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన తరువాత ఆరోగ్యం భాగాలేనందున రమేష్ హాస్పటల్ లో చర్చలని కోరారు. అందుకు కోర్ట్ అంగీకరించినట్లు ప్రచారం జరిగింది . తరువాత ఆయన మెడికల్ రిపోర్ట్ కోర్ట్ కు చేరిన తరువాత కోర్ట్ వెంటనే రమేష్ హాస్పటల్ కు పంపించాలని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎ సి బి పోలీసులు కోర్ట్ ఆదేశాలను కూడా లెక్కచేయకుండా జిల్లా జైలుకు తరలించారని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. అయితే ఎ సి బి రాఘురామ తో పాటు మీడియా సంస్థలపై కేసులు నమోదు చేశాయి. మీడియా పై కేసులు నమోదు చేయడం సరైంది కాదనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. మీడియా కూడా లక్ష్మణ రేఖను దాటకుండా ఉండాలనే సూత్రాన్ని వదిలి పెట్టింది. ఎవరికో వొకరికి వత్తాసు పాలక కుండా గొంతు లేని ప్రజల గొంతుకగా ఉంటుందనే ఉద్దేశంతోనే మన రాజ్యాంగ నిర్మాతలు మీడియాకి తగిన గౌరవం ఇచ్చారు. దాన్ని కాపాడు కోవలసిన బృహత్తర భాద్యత మీడియా యాజమాన్యాలపై ఉంది.

Related posts

బీఆర్ యస్, కామ్రేడ్ల పొత్తు  కసరత్తు కొలిక్కి వచ్చేనా … …?

Drukpadam

రేపే ఖమ్మంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌…అభ్యర్థుల్లో టెన్షన్!

Drukpadam

రాహుల్ తో కలిసి నడిచిన మహాత్మాగాంధీ ముని మనవడు!

Drukpadam

Leave a Comment