Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి ఇంటికి ఈటెల వెళ్లిన విషయం నాకు తెలియదు …అయినా తప్పేమికాదు …బండి సంజయ్!

పొంగులేటి వద్దకు వెళ్లిన విషయం ఈటల నాకు చెప్పకపోవడం తప్పేం కాదు: బండి సంజయ్!

  • పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ తెలంగాణ చీఫ్
  • తన వద్ద ఫోన్ లేకపోవడం వల్లే ఈటల తనకు కలిసిన విషయం చెప్పలేదని వ్యాఖ్య
  • బీజేపీలో అందరి టార్గెట్ ఒకటే.. ఎవరి పనులు వారు చేసుకుంటారన్న బండి
  • బీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకి మాత్రమే ఉందన్న సంజయ్

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. పొంగులేటి వద్దకు తమ పార్టీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వెళ్లారనే విషయం తనకు తెలియదని చెప్పారు. వాస్తవానికి తన వద్ద ఫోన్ లేదని, అందుకే ఇప్పటి వరకు తనకు ఎలాంటి సమాచారం లేదని, తన వద్ద ఫోన్ లేకపోవడం వల్ల ఈటల తనకు వెంటనే ఆ విషయం చెప్పకపోవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు.

పొంగులేటి పార్టీలోకి వస్తే మాత్రం ఆహ్వానిస్తామన్నారు. పార్టీలో ఎవరి పనులు వారు చేసుకుంటారన్నారు. తనకు తెలిసిన వారితో తాను, ఈటలకు తెలిసిన వారితో ఆయన మాట్లాడుతారని చెప్పారు. బీజేపీలో అందరి లక్ష్యం ఒక్కటేనని, వాళ్లు పొంగులేటిని కలిస్తే తప్పేమిటన్నారు. బీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్మున్న ఏకైక పార్టీ బీజేపీయే అన్నారు.

కరీంనగర్ లో క్రమబద్ధీకరణ డిమాండ్ తో నిరసన వ్యక్తం చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలోని రాక్షస పాలనపై పోరాడేందుకు తాము ఎవరితో అయినా కలిసి వెళ్తామన్నారు. కాగా, కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిరసన కోసం ఏర్పాటు చేసుకున్న టెంటును పోలీసులు తొలగించారు. దీంతో ఉద్యోగులు గొడుగుల సాయంతో నిరసన తెలిపారు. వారితో పాటు బండి సంజయ్ దీక్షలో పాల్గొన్నారు.

Related posts

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: నదిలోకి దూసుకెళ్లిన కారు.. 9 మంది మృతి!

Drukpadam

సీబీఐ వద్దా?..అయితే న్యాయ విచార‌ణ‌కైనా ఓకే: జితేంద‌ర్ రెడ్డి

Drukpadam

బీఆర్ఎస్ పార్టీలా కాదు.. మా పార్టీలో ఎవరైనా సీఎం కావచ్చు: మాణిక్ రావు ఠాక్రే..!

Drukpadam

Leave a Comment