పొంగులేటి నిర్ణయంపై ఉత్కంఠ …కొనసాగుతున్న తర్జన భర్జనలు….
-సొంతపార్టీ పెట్టబోతున్నారని ప్రచారం…
-మరికొన్ని రోజులు సస్పెన్షన్ కొనసాగే అవకాశాలు
-కర్ణాటక ఎన్నికల కోసం ఎదురు చూపులు
-బీజేపీ నా …? కాంగ్రెస్ నా …?? సన్నిహితులతో సమాలోచనలు
-కాంగ్రెస్ వైపు చూస్తున్న పొంగులేటి అనుయాయులు
-కలుస్తున్న బీజేపీ ,కాంగ్రెస్ నేతలు …కేంద్ర నాయకుల ఆరా …!
-రా …రా రమ్మంటున్న బీజేపీ …అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ
-కాంగ్రెస్ నుంచి కూడా ఆఫర్లు … అటా…ఇటా అనే దానిపై సందిగ్ధం
-తెలుగుదేశం నుంచి కూడా ఆహ్వానం …
బీఆర్ యస్ మాజీ నేత ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే దానిపైనా రోజురోజుకు ఉత్కంఠత పెరుగుతుంది. శీనన్న ఇంకెప్పుడన్న అంటున్నారు అనుయాయులు … ఆయన కోసం బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు రెండు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. కొత్తగా టీడీపీ కూడా తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానించింది. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు . ఆయన మాత్రం ఎవరికీ తాను చేరతానని హామీ ఇవ్వలేదు … ఆచూతూచి అడుగులు వేస్తున్నారు… నిజంగా ఆయన పై విఫరీతమైన వత్తిడి ఉన్నా, ఎవరికీ ఇంతవరకు సందు ఇవ్వడంలేదు . రాజకీయ నిర్ణయంపై ఆగండి …ఆగండి అని తన అనుచరులను సముదావిస్తున్నారు . ఇంకా ఎంతకాలం సాగదీస్తారు … ఎదో ఒకటి తేల్చుకోవాలని లేకపోతె నష్టం జరుగుతుందనే అభిప్రాయాలు అనువాయిల నుంచి వ్యక్తం అవుతున్నాయి . అయినప్పటికీ ఆయన రాజకీయ నిర్ణయం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. ప్రత్యేకించి కర్ణాటక ఎన్నికల వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు సమాచారం .
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజల్లో బలమున్న నాయకుడిగా పేరున్న పొంగులేటి దారెటు అనే దానిపై తర్జన భర్జనలు జరుగుతుండటం ఆసక్తిగా మారింది . కొన్ని రోజులు కాంగ్రెస్ లో చేరబోతున్నాడని ,మరికొన్ని రోజులు బీజేపీలో చేరుతున్నారని జోరుగా వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఆయన కూడా ఎటు తేల్చుకోలేక పోతున్నారు. అయితే ఒక్కటి మాత్రం స్పష్టం అంటున్నారు. బీఆర్ యస్ ను రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం అనేది తమ ఎజెండా అంటున్నారు . అందుకోసం బీఆర్ యస్ వ్యతిరేకులను ఐక్యం చేసే పనిలో పడ్డారు . చర్చోపచర్చలు జరుపుతున్నారు . తాను నిర్ణయం అందరు అనుకున్న విధంగానే ఉంటుందని నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు …దీనిపై ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వహించుకుంటున్నారు …
అటు బీజేపీ , ఇటు కాంగ్రెస్ నుంచి పొంగులేటి, జూపల్లిలను వారి అనుయాయులను పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు . బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ,కమిటీ సభ్యులు కొండా విశ్వేశరరెడ్డి , దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు , మాజీ ఎమ్మెల్యేలు రవీందర్ రెడ్డి , మహేశ్వర్ రెడ్డి లతో కూడిన బృందం ఖమ్మంలోని పొంగులేటి ఇంటికి వచ్చింది. ఆయన్ను పార్టీలోకి రావాలని ఆహ్వానించింది. ఇదే విషయం చర్చల అనంతరం ఈటెల మీడియా తో మాట్లాడుతూ చెప్పారు . తమ చర్చల సందర్భంగా అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయని అందులో కేసీఆర్ ను తిరిగి అధికారంలోకి రాకుండా చేయడం కామన్ ఎజెండాగా ఉందని అన్నారు. ఇదే విషయాన్నీ బీజేపీ వాళ్ళు వెళ్లిన తర్వాత మీడియా తో మాట్లాడుతూ పొంగులేటి , జూపల్లి కలిసి చెప్పారు . పార్టీలో చేరడం అనేది ఒక రాత్రికి రాత్రే జరిగే జరిగేది కాదని మరికొన్ని సీటింగ్ లు వేయాలని అనుకున్నామని అన్నారు . ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం కనీస దర్మం అని అందువల్లనే వారికీ లంచ్ ఏర్పాటు చేశామని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా కలిశారని , మిగతా వాళ్ళు కూడా కలుస్తున్నారని ,కమ్యూనిస్టులు కూడా కాలువ వచ్చునని పొంగులేటి అన్నారు .
అయితే వారి మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లు సమాచారం ..బీజేపీ కాళేశ్వరం అవినీతి గురించి నిత్యం ఆరోపణలు చేస్తుంది కదా… ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించినట్లు తెలుస్తుంది….. అదే విధంగా రాష్ట్రంలో అవినీతి అక్రమాలపై ఏమి చర్యలు తీసుకున్నారు… లిక్కర్ స్కాములో కేంద్ర వైఖరి ఏమిటి అనేదానిపై బీజేపీ నేతలను ప్రశ్నించారు … వారిపై చర్యలు తప్పకుండ ఉంటాయని మరి కొంతాకాలం ఆగాలని అన్నట్లు సమాచారం. తాము కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా ఆదేశాల మేరకే వచ్చామని వారు వెల్లడించారు .
అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,జూపల్లి కృష్ణారావు లు మరో ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. వారు సొంతంగా పార్టీ పెట్టి బీఆర్ యస్ ను గద్దె దించే లక్ష్యం కోసం అటు బీజేపీ ,ఇటు కాంగ్రెస్ పార్టీల మద్దతు తీసుకోవాలి ఆలోచనలు చేస్తున్నారు .అయితే ఇది ఆచరణ సాధ్యమేనా ఉత్తర ,దక్షణ దృవాలుగా ఉన్న కాంగ్రెస్ ,బీజేపీలు వీరికి సహకరించడం సాధ్యమయ్యే పనేనా అంటున్నారు పరిశీలకులు … ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఖమ్మం వైపు చూస్తున్నాయి. పొంగులేటి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు . పొంగులేటి, జూపల్లి ఏలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొన్నది చూద్దాం ఏమిజరుగుతుందో…..!