Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హైదరాబాదులో యువ సంఘర్షణ సభ… హాజరవుతున్న ప్రియాంక గాంధీ!

హైదరాబాదులో యువ సంఘర్షణ సభ… హాజరవుతున్న ప్రియాంక గాంధీ

సరూర్ నగర్ ప్రియాంక సభకు విస్తృత ఏర్పాట్లు …
రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనాయకులు అందరు పాల్గొనే అవకాశం
భట్టి పీపుల్ మార్చ్ కూడా సరూర్ నగర్ చేరుకుంటుంది.
ప్రియాంక యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారన్నభట్టి
హైద్రాబాద్ , రంగారెడ్డి నల్గొండ , మహబూబ్ నగర్ జిల్లాలనుంచి జనసమీకరణ
హైద్రాబాద్ లోనే మకాం వేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యరావు ఠాక్రే

సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగుల బహిరంగ సభ

రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు శంషాబాద్ చేరుకోనున్న ప్రియాంక

ప్రత్యేక హెలికాప్టర్ లో సరూర్ నగర్ పయనం

సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటించనున్న ప్రియాంక 

 

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రేపు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులతో నిర్వహించే యువ సంఘర్షణ సభకు ఆమె హాజరుకానున్నారు. ప్రియాంక రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు శంషాబాద్ చేరుకుంటారు. అక్కడ్నించి ప్రత్యేక హెలికాప్టర్ లో సరూర్ నగర్ పయనమవుతారు.

సాయంత్రం 4.30 గంటలకు సరూర్ నగర్ సభలో ప్రియాంక ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు ప్రియాంక గాంధీ సభ నుంచి తిరుగు పయనమవుతారు. ప్రియాంక పర్యటనపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. రేపటి నిరుద్యోగుల బహిరంగ సభలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని వెల్లడించారు.

సోమవారం హైద్రాబాద్ లోని సరూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వరంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ నిరసన ర్యాలీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు . ఇందుకోసం పీసీసీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. జనసమీకరణ కోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివిధ నాయకులతో సమన్వయం చేస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా సోమవారం సరూర్ నగర్ చేరుకుంటారు . నిరుద్యోగ నిరసన సభలో పాల్గొంటారు . ఈ సభలో ప్రియాంక యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని భట్టి తెలిపారు . ఈ సభలో రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలు అంతా పాల్గొనే అవకాశం ఉంది. హైద్రాబాద్ , రంగారెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ , ఉమ్మడి నల్గొండ జిల్లాలనుంచి జనసమీకరణ చేయనున్నారు . ప్రియాంక మొదటిసారిగా రాష్ట్రంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటున్నారు. అందువల్ల నాయకులు కూడా ఈసభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు . ప్రియాంక సభపై కాంగ్రెస్ పెద్ద ఆశలు పెట్టుకున్నది . కాంగ్రెస్ కార్యకర్తలకు ఈసభ జోష్ నింపనున్నదని భావిస్తున్నారు .

Related posts

బద్వేలులో ఆర్మీ మొత్తాన్ని దించినా మాకేమీ ఇబ్బందిలేదు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి!

Drukpadam

వద్దిరాజు తిరిగి ఎంపీనేనా …? ఎమ్మెల్యేనా …??

Drukpadam

ఓటీ ఎస్ పై చంద్రబాబు ఆగ్రహం …సజ్జల వివరణ…

Drukpadam

Leave a Comment