Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక బూటకం: కేజ్రీవాల్….

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక బూటకం: కేజ్రీవాల్….

  • లిక్కర్ స్కామ్ లో ఇద్దరు నిందితులకు బెయిల్ ఇచ్చిన కోర్టు
  • మనీ లాండరింగ్‌కు సంబంధించిన సాక్ష్యం లేదని కోర్టు చెప్పిందన్న కేజ్రీవాల్
  • స్కామ్ పేరుతో ఆప్‌ని కించపరిచేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర అని ఆరోపణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం ఒక బూటకమని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇప్పుడు కోర్టులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని అన్నారు. ఈ కేసులో అరెస్టు అయిన రాజేశ్‌ జోషి, గౌతమ్ మల్హోత్రాలకు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. లంచం కింద డబ్బు చెల్లించినట్లు కానీ, తీసుకున్నట్లు కానీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎలాంటి సాక్ష్యాధారాలు చూపలేకపోయిందని జడ్జి వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా ఈరోజు స్పందించారు. ‘‘లిక్కర్‌ స్కామ్ మొత్తం ఒక బూటకం. మేం ముందు నుంచి ఈ విషయం చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు కోర్టులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఆప్ లాంటి నిజాయతీ గల పార్టీని అపఖ్యాతి పాలు చేసేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర ఇది’’ అని విమర్శించారు.

‘‘లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్‌కు సంబంధించిన సాక్ష్యం లేదని ఇప్పుడు కోర్టు కూడా చెప్పింది. మద్యం కుంభకోణం అంతా బూటకమని, కేవలం ఆప్‌ని కించపరిచేందుకేనని మేము మొదటి నుంచి చెబుతున్నాం’’ అని అంతకుముందు ఓ ట్వీట్ చేశారు.

Related posts

బిగ్ బాస్ హౌస్ పై నారాయణ కామెంట్ …కేసుపెడతానన్న నాగార్జున పెట్టుకోమన్న నారాయణ!

Drukpadam

నిన్న కాంగ్రెస్ లో చేరిక నేడు రాజీనామా..డి .శ్రీనివాస్ విషయంలో ట్విస్ట్!

Drukpadam

ట్యాంక్‌ బండ్ పై వైఎస్ షర్మిల అరెస్ట్.. మౌన దీక్ష భగ్నం…

Drukpadam

Leave a Comment