Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సీఎం సలహాదారుగా సోమేశ్ కుమార్ నియామకంపై భట్టి ఫైర్ …

సీఎం సలహాదారుగా సోమేశ్ కుమార్ నియామకంపై భట్టి ఫైర్ …
-ఆయన్ను స్కాముల కోసమే తీసుకున్నారని తీవ్ర ఆరోపణ
-ఆయన హయాంలో జరిగిన హయాంలో జరిగిన స్కాంలపై విచారం జరపాలని డిమాండ్ …
-సోమేశ్ కుమార్‌ను మళ్లీ తీసుకురావడం కేసీఆర్ కే నష్టం
-రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు పదవుల కోసం పాకులాడకూడదన్న భట్టి 
-ముఫ్పై ఏళ్ల కోసం టోల్ వసూలు చేసే అధికారం ఇవ్వడంపై ప్రశ్న
-సోమేశ్ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపట్టాలని డిమాండ్

ఐఏఎస్ ,ఐపీఎస్ అధికారులను రిటైర్మెంట్ అయిన తర్వాత సలహాదారులుగా నియమించుకోవడపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి.
మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను రిటైర్ మెంట్ అనంతరం తిరిగి ప్రత్యేకంగా తన సలహాదారుగా నియమించుకోవడంపై సీఎల్పీ నేత భట్టి ఫైర్ అయ్యారు .స్కాముల కోసమే సోమేశ్ కుమార్ ను మళ్లీ తీసుకువచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు ఇంకా పదవుల కోసం పాకులాడవద్దని హితవు పలికారు. రిటైర్ అయ్యాక కూడా పదవులు పట్టుకొని వేలాడటం సరికాదన్నారు. రిటైర్డ్ అధికారులు వైదొలిగి యువతకు అవకాశం ఇవ్వాలని సూచించారు. ముప్పై ఏళ్ల కోసం టోల్ వసూలు చేసే అధికారం ఎవరికైనా ఇస్తారా అని ప్రశ్నించారు. అలా తీసుకుంటే వచ్చే ప్రభుత్వాలు ఏం చేస్తాయని నిలదీశారు.

సోమేశ్ కుమార్ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన కనుసన్నుల్లోనే హైదరాబాద్ చుట్టూ లక్షల కోట్ల రూపాయల భూములు చేతులు మారాయని మండిపడ్డారు. ఫార్మాసిటీ కట్టడానికి పేదల భూములు ఎందుకని, గజ్వేల్, సిరిసిల్లల్లో ప్రభుత్వ భూములు లేవా? అని నిలదీశారు. కేసీఆర్ లాక్కున్న భూములను తాము అధికారంలోకి వచ్చాక తిరిగి ఇస్తామన్నారు. తన పాదయాత్రలో ప్రజలు తమ బాధలను చెప్పుకుంటున్నారని ఇల్లు కావాలని , పెన్షన్ రావడంలేదని ,, వర్షాలకు తడిసిన పంటలలను కొనుగులో చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తారు .

Related posts

నదీ జలాల పేరుతో కేసీఆర్, జగన్ విద్వేషాలు: తమ్మినేని వీరభద్రం…

Drukpadam

పన్ను’పోటుతో వేధించడం మీకు పైశాచిక ఆనందమా?: రేవంత్ రెడ్డి

Drukpadam

వైసీపీలో పెరుగుతున్న అసమ్మతి!

Drukpadam

Leave a Comment