Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పొంగులేటి కాంగ్రెస్ లోకేనా….? రాష్ట్ర రాజధానిలో జోరుగా చర్చలు…

పొంగులేటి కాంగ్రెస్ లోకేనా….? రాష్ట్ర రాజధానిలో జోరుగా చర్చలు….
-బీఆర్ యస్ సర్కిల్స్ లో కూడా అదే టాక్
-బయటకు పొక్కనివ్వని పొంగులేటి
-కర్ణాటక ఎన్నికల తర్వాతనే తన మోనోగతాన్ని బయటపెట్టే అవకాశం
-కాంగ్రెస్ లోకి అయితే జిల్లాలో 10 కి 10 సీట్లు ఖాయం అంటున్న రాజకీయ పరిశీలకులు

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ అడుగులపై కొన్ని నెలలుగా ఉన్న సందిగ్దత తొలిగిపోయి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ లో మాత్రం ఆయన కాంగ్రెసులోకి వెళ్లడం దాదాపు ఖాయమైందిని అంటున్నారు …బీఆర్ యస్ సర్కిల్స్ లో కూడా అదే టాక్ నడుస్తుంది. అయితే ఈ విషయాన్నీ పొంగులేటి బయటకు పొక్కనివ్వకుండా గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. ఆయన మనసులో కూడా కర్ణాకట ఎన్నికల వరకు వేచి చూసే ధోరణలు ఉన్నారు . అక్కడ ఫలితాలు తెలంగాణ పై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అప్పుడు కేసీఆర్ ను గద్దె దించగలిగే పార్టీగా అధికారంలోకి వచ్చే పార్టీ నిలుస్తుందని ఆయన మనోగతంగా ఉన్నట్లు తెలుస్తుంది.

బీఆర్ యస్ పై కసి పట్టుదలతో ఉన్న పొంగులేటి , జూపల్లిలు కాంగ్రెస్ కు జై కొట్టే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు …రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గత కొన్ని నెలల క్రితంతో పోల్చితే బాగా పుంజు కుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ తెలంగాణ లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు . బీజేపీకి అధికారానికి దరిదాపుల్లో కూడా లేదని అందువల్ల బీజేపీలోకి వెళ్ళితే తమ ప్రతిజ్ఞలు ,ఛాలంజ్ లకు అర్థం లేదని కూడా వారి అనుయాయులు సైతం అంటున్నారు . పైగా ఇటు పొంగులేటి , అటు జూపల్లి లు బీజేపీలోకి వెళ్లాలని భావించినప్పటికీ వారిని అభిమానించే వాళ్ళు , వారి అనుయాయులు వారితో విభేదిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

కాంగ్రెస్ ,బీజేపీ లనుంచి ఆయనకు ఆహ్వానాలు ఉన్నాయి. బీజేపీ చేరికల కమిటీ నేత ఈటెల రాజేందర్ ఆధ్వరంలో ఇటీవల ఖమ్మం వచ్చిన బృందానికి సైతం పొంగులేటి ,జూపల్లి ఎలాంటి హామీ ఇవ్వలేదు . అందువల్ల వారి మనుసులో మాటలు కూడా వారికీ అర్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది.

పొంగులేటి కాంగ్రెస్ కు వెళ్ళితే ఉమ్మడి ఖమ్మం జిల్లలో 10 కి 10 సీట్లు రావడం ఖాయం అంటున్నారు రాజకీయపండితులు ….రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు ….

Related posts

రిమాండ్ లేకుండానే బెయిలా?.. నారాయణ బెయిల్ ను రద్దు చేయాలంటూ ప్రభుత్వం పిటిషన్!

Drukpadam

పర్యాటకుల ప్రాధాన్యం ‘గోవా’.. తర్వాత మనాలి!

Drukpadam

కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా ద‌క్కే అర్హ‌త లేదు: కేంద్ర ప్ర‌భుత్వం!

Drukpadam

Leave a Comment