Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీఆర్ యస్ తో పొత్తు కుదరకపోతే 119 సీట్లలో పోటీ…సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని…

బీఆర్ యస్ తో పొత్తు కుదిరితేసరి లేకపోతె 119 సీట్లలో పోటీసిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
ఎమ్మెల్సీ సీట్లకు అంగీకరించేది లేదు ..
పొత్తు అనేది పరస్పర అంగీకారంతో జరగాలి
బీఆర్ యస్ చర్చలకు ఆహ్వానించిందిచర్చల తర్వాత నిర్ణయం ప్రకటిస్తాం!
ప్రజాసమస్యలపై పోరుబాటలో రాజీలేదు
ఇటీవల జరిగిన యాత్రల్లో 6 లక్షల మంది పాల్గొన్నారు
ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది
గ్రామ కార్యదర్శుల సమస్య పరిష్కరించాలని డిమాండ్
ధాన్యం మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి
రైతులకు ప్రకటించిన నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి ..

బీఆర్ యస్ తో పొత్తు కుదిరితేసరి, లేకపోతె మొత్తం 119 సీట్లలో పోటీకి వెనకాడబోమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బాంబ్ పేల్చారు . ఎమ్మెల్సీ సీట్లకు అంగీకరించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు .ప్రజల్లో ఉంటాం ,ప్రజలకోసం పోరాడతాంఅంతేకాని ఎవరి మెప్పుకోసమో మోకరిల్లే ప్రశ్న తలెత్తదని స్పష్టం చేశారు . అసరమైతే తల ఇస్తాం తప్ప తలదించుకోమని ఉద్ఘాటించారు ….రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టుల పోటీ ఖాయమని ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని అన్నారు .

శుక్రవారం సిపిఐ ఖమ్మం జిల్లా కార్యాలయం గిరిప్రసాద్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు బీఆర్ యస్ నమ్మకమైన పక్షంగా పోరాడుతుందని అందువల్లనే ఆపార్టీతో కలిసి వెళ్లాలని తెలంగాణలో సిపిఐ , సిపిఎం పార్టీలు నిర్ణయుంచుకున్నాయన్నారు . బీఆర్ యస్ తో పొత్తుకు తాము సిద్ధం అని చెప్పాంఅదే మాటకు కట్టుబడి ఉన్నాంఇప్పుడు అదే చెపుతున్నాం . అదే సందర్భంలో పొత్తు అంటే గౌరవప్రదంగా ఉండాలి తప్ప ఒకరు ఆదేశించేవారు మరొకరు ఆచరించేవారిగా ఉండకూడదని పేర్కొన్నారు . కమ్యూనిస్ట్ పార్టీలుగా ప్రజలకోసం దశబ్దాలుగా పోరాటాలు చేస్తున్న చరిత్ర తమకుందని ,నిరంతరం పేదలకోసం , కార్మికులు , రైతులు , యువజనులు , విద్యార్థులు , నిరుద్యోగులు మహిళల హక్కుల కోసం ఉద్యమాలు చేస్తున్న పార్టీలుగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా చట్ట సభల్లో గొంతులేని వారి గొంతుకగా వారి వాణి వినిపిస్తామని చెప్పారు . అందుకోసం ఈసారి తెలంగాణ అసెంబ్లీ లో అడుగుపెడతామనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు .

ఇటీవల కమ్యూనిస్టుల పొత్తులపై వస్తు్న వార్తలను ఆయన ప్రస్తావిస్తూ అసలు ఇంతవరకు బీఆర్ యస్ తో ఎలాంటి చర్చలు జరగలేదని చర్చలు జరుపుదామని బీఆర్ యస్ నుంచి కబురు వచ్చిందని చర్చల్లో తమ ప్రతిపాదనలు వారి ముందు ఉంచుతామని అన్నారు . చర్చలు గౌరప్రదంగా ఉంటె మంచిదని అభిప్రాయపడ్డారు . కొందరు తమకు బీఆర్ యస్ కు మధ్య పొత్తు కుదిరిందని కేసీఆర్ తమకు ఎమ్మెల్సీ సీట్లు ,రాజ్యసభ సీట్లు ఇస్తామని చెప్పారని అందుకు తాము అంగీకరించినట్లుగా వార్తలు వచ్చాయని అసలు తాము కలవకుండానే కలిసినట్లు , ఎమ్మెల్సీలకు అంగీకరించినట్లు వార్తలు రావడం బాధాకరమని సాంబశివరావు పేర్కొన్నారు . ఇలాంటి వార్తలు వండి వార్చొద్దని హితవు పలికారు . మీ వ్యూస్ ఉంటె రాసుకోండి కానీ జరగని విషయాలు జరిగినట్లు చెప్పడం పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు . ఎట్టి పరిస్థితిలోను ఎమ్మెల్సీ సీట్లకు అంగీకరించబోమని కుండబద్దలు కొట్టారు . పొత్తులు ఉంటయో ఉండవో చెప్పలేమని బీఆర్ యస్ తో చర్చల తర్వాత ఒక క్లారిటీ వస్తుందని అన్నారు .

ప్రస్తుతం దేశంలో రాజకీయాలు చాలావేగంగా మారబోతున్నాయి. ప్రాంతీయ పార్టీలు అన్ని ఐక్యం అవుతున్నాయి. బీజేపీ మతోన్మాద చర్యలను తిప్పికొట్టేందుకు జరుగుతున్న చర్చలు ఆశాజనకంగా ఉన్నాయి . అందువల్ల మన రాష్ట్రంలో కూడా ఎదో విధంగా కాలుమోపాలని చూస్తున్న బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకు పోతామని అన్నారు . కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే, దక్షిణాదిన చోటు కోల్పోవడమేనని ఇక ఉత్తరాదిని ప్రజల్లో దాని నిజస్వరూపం ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు . బీజేపీ వ్యతిరేక పోరులో బీఆర్ యస్ అధినేత కేసీఆర్ ముందుడాలని కోరుకుంటున్నామని అందువల్లనే పార్టీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నామని అన్నారు .అయితే అది పరస్పరం ఉభయతారకంగా ఉండాలని అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు .

ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులు ఆదుకోవాలని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో జాప్యం జరగడాన్ని ఆయన తప్పు పట్టారు .గ్రామ కార్యదర్శులను రెగ్యూలరైజ్ చేయాలనీ జరుపుతున్న పోరాటానికి సిపిఐ మద్దతు ఉంటుందని అన్నారు . అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు . బీఆర్ యస్ తో పొత్తు ఉన్నా ,పొత్తు పొత్తే పోరాటం పోరాటమేనని అన్నారు . విలేకర్ల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు , సిపిఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ మౌలానా , సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ , జానీమియా ,సిద్దినేని కరుణాకర్ లు పాల్గొన్నారు .

కొత్తగూడెం భారీ బహిరంగ సభకు జాతీయ కార్యదర్శి రాజా

రాష్ట్రంలో నాలుగైదు చోట్ల సిపిఐ సభలు నిర్వహిస్తామని , కొత్తగూడెంలో భారీ బహిరంగసభ ఉంటుందని సభకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా కార్యదర్శి నారాయణ అజిజ్ పాషా తదితరులు హాహారవుతారని తెలిపారు . .

 

Related posts

విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు జనసేన వ్యతిరేకం …పవన్ కళ్యాణ్ …

Drukpadam

తెలంగాణ పోలీసుల తీరుపై సీఎల్పీ నేత భట్టి ఆగ్రహం!

Drukpadam

దమ్ముంటే వారి పేర్లు బయటపెట్టండి.. జగన్‌కు చంద్రబాబు సవాల్…

Drukpadam

Leave a Comment