Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అవినీతి ,మత రాజకీయాలను పాతరేసిన కన్నడిగులు…

అవినీతి ,మత రాజకీయాలను పాతరేసిన కన్నడిగులు…
-పనిచేయని ప్రధాని మోడీ, హోమ్ మంత్రి మానియా
-లౌకికతత్వానికి జై కొట్టిన కన్నడ ప్రజలు
-స్పష్టమైన మెజార్టీ దిశగా కాంగ్రెస్
-బొమ్మై మంత్రివర్గంలో అనేకమంది మంత్రులు వెనుకంజ

కర్ణాటక లో ఎన్నికల ఫలితాలు ట్రెండ్ ప్రకారం కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోయింది. బీజేపీ అవినీతి , మత రాజకీయాలను కన్నడిగులు పాతరేశారు . భజరంగదళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టో లో పెట్టినందున కాంగ్రెస్ కు వ్యతిరేకత వస్తుందని అందువల్ల తమకు అది కలిసొచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ అది జరగలేదు …ప్రధాని మోడీ , హోమ్ మంత్రి అమిత్ షా మానియా పనిచేయలేదు …ఎక్కడ ప్రరాచారం చేయనివిధంగా కర్ణాటక లో చేశారు . అనేక బహిరంగ సభల్లో పాల్గొన్నారు .రోడ్ షో లు చేశారు . ఒక్క బెంగుళూరు లోనే మూడు రోజులు ప్రధాని ప్రచారం చేశారు . రోడ్ షోలకు ప్రజలు ఎగబడ్డారు . పూలవర్షం కురిపించారు . కానీ ఓటర్లు మాత్రం కమలం గుర్తును కనికరించలేదు …లౌకికతత్వానికి కన్నడ ప్రజలు జైకొట్టారు .

10 రౌండ్లు లెక్కిపు పూర్తీ అయ్యేసరికి కాంగ్రెస్ 121 ,బీజేపీ 71 జేడీఎస్ 25 ,ఇతరులు 7 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు .బీజేపీ కి చెందిన బొమ్మై మంత్రివర్గంలో ఉన్న అనేక మంది మంత్రులు ఓటమి దిశగా ఉన్నారు .

గెలిచిన అభర్ధులు బెంగుళూరు వచ్చేందుకు 15 హెలీకాఫ్టర్లు ఉపయోగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి . తమకు పూర్తీ మెజార్టీ వస్తున్నట్లు తెలుస్తున్నప్పటికీ కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకోవడంపై రాజకీయ పరిశీలకులు ఆశ్చర్య పడుతున్నారు .

Related posts

భార్య అయినా సరే.. ఇష్టంలేని శృంగారాన్ని తిరస్కరించొచ్చు: ఢిల్లీ హైకోర్టు

Drukpadam

సొంత నిధులతో వకుళమాత ఆలయాన్ని నిర్మించిన మంత్రి పెద్దిరెడ్డి…

Drukpadam

టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై ఎందుకు దాడి జ‌ర‌గ‌లేదు?: మంత్రి విశ్వ‌రూప్‌

Drukpadam

Leave a Comment