Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సీఎం పదవి కోసం ఢిల్లీ వెళ్లిన సిద్దు …అసంతృప్తి తో బెంగుళూర్ లో ఉన్న డీకే …

సీఎం పదవి కోసం ఢిల్లీ వెళ్లిన సిద్దు …అసంతృప్తి తో బెంగుళూర్ లో ఉన్న డీకే …
-అధిష్టానానికి కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపిక చిక్కు …
-మెజార్టీ ఎమ్మెల్యేలు నన్నే కోరుకుంటున్నారంటున్న సిద్దరామయ్య
-సీఎం పదవి ఎంపిక అధిష్టానానికి వదిలేశామన్న డీకే శివకుమార్
-డీకే శివ‌కుమార్‌తో త‌న‌కు ఎలాంటి విభేదాలు లేవ‌న్న సిద్ధరామయ్య
-ఆయ‌న‌తో వ్య‌క్తిగ‌తంగా మంచి సంబంధాలు ఉన్నాయ‌ని వెల్లడి
-పార్టీ హైక‌మాండ్‌తో చ‌ర్చించేందుకు ఇప్పటికే ఢిల్లీకి మాజీ సీఎం
-కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో నా బాధ్యత నేను నిర్వర్తించానని శివకుమార్ వ్యాఖ్య
-వన్ లైన్ తీర్మానాన్ని ఆమోదించామని తెలిపిన కాంగ్రెస్ చీఫ్
-ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకోలేదని వ్యాఖ్య

 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు రోజులు దాటింది. ఇప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనేది ఖరారు కాలేదు. సిద్ధరామయ్యా? శివకుమారా? అనే ఉత్కంఠకు తెరపడలేదు. ఈ విషయంలో అధిష్ఠానం స్పష్టతకు రాలేకపోతోంది. చర్చోపచర్చలు జరుపుతూనే ఉంది. మరోవైపు డీకే శివకుమార్, సిద్ధరామయ్య తమ ప్రయత్నాలు తాము కొనసాగిస్తున్నారు. దీంతో సీఎల్పీ నేతగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో అధిష్టానానికి చిక్కు సమస్యగా మారింది. ఆదివారం జరిగిన నూతన ఎమ్మెల్యేల సమావేశం సీఎం ఎవరెనేది నిర్ణయించే భాద్యతను అధిష్టానానికి వదిలేసింది. ఢిల్లీ లో దీనిపై కసరత్తు జరుగుతుంది. ఇద్దరు నేతలను ఢిల్లీకి రావాలని పిలుపు వచ్చినప్పటికీ సిద్దరామయ్య ఒక్కరే వెళ్లారు .డీకే శివకుమార్ తాను ఢిల్లీ వెళ్లడంలేదని స్పష్టం చేశారు . దశాబ్దాలుగా పార్టీకోసం కస్టపడి పనిచేస్తున్న డీకే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఆయన బెంగుళూరు లోనే ఉన్నారు .

ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ న్యూస్ చానల్ తో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది తననే సీఎంగా కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కర్ణాటక సీఎం రేసులో ఉన్న డీకే శివ‌కుమార్‌తో త‌న‌కు ఎలాంటి విభేదాలు లేవ‌ని, ఆయ‌న‌తో వ్య‌క్తిగ‌త సంబంధాలు మెరుగ్గా ఉన్నాయ‌ని సిద్ధ‌రామ‌య్య చెప్పారు. 

‘‘జాతీయ రాజకీయాల్లో ఇదొక మలుపు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని, చేతులు కలపాలని కోరుతున్నా’’ అని అన్నారు. మ్యానిఫెస్టోలో పొందుప‌రిచిన హామీల‌న్నీ నెర‌వేరుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కర్ణాటక సీఎం వ్య‌వ‌హారంపై పార్టీ హైక‌మాండ్‌తో చ‌ర్చించేందుకు ఆయ‌న ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు.

మరోవైపు సీఎం ప‌ద‌విని చెరి రెండున్న‌రేండ్లు పంచుకోవాల‌నే ప్ర‌తిపాద‌నను డీకే శివ‌కుమార్ తోసిపుచ్చినట్టు స‌మాచారం. రాజ‌స్థాన్‌, చ‌త్తీస్‌గఢ్ ఉదంతాల‌ను ఉటంకిస్తూ డీకే ఈ ప్ర‌తిపాద‌న‌ను తిరస్కరించినట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లీ వెళ్లడంలేదు ….అధిష్టానం ఏమి చేయాలో అది చేస్తుంది …డీకే

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను తన బాధ్యతను నిర్వర్తించానని, ఇప్పుడు పార్టీ అధిష్ఠానం ఏం చేయాలో చెబుతుందని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. తాము వన్ లైన్ తీర్మానాన్ని ఆమోదించామని, దాని ప్రకారం పార్టీ అధిష్ఠానానికి వదిలేశామని చెప్పారు. తాను ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకోలేదన్నారు. తాను చేయాల్సింది చేశానని ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివకుమార్ విలేకరులతో అన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేసులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉన్నారు. కర్ణాటక కాంగ్రెస్ సీఎం పదవి ఎంపికను అధిష్ఠానానికి వదిలేసింది. 2013-18 కాలంలో కర్ణాటక సీఎంగా పనిచేసిన అనుభవం సిద్ధరామయ్యకు ఉండగా, శివకుమార్ ముఖ్యమంత్రి అయితే ఇదే తొలిసారి అవుతుంది.

సిద్ధరామయ్యను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా చెబుతారు. అందుకే సిద్ధూకి ఆయన మద్దతు ఉందని చెబుతారు. అయితే శివకుమార్… పార్టీకి ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచారు. గాంధీ కుటుంబానికి, ముఖ్యంగా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సన్నిహితంగా ఉంటారు.

నా బలం మాత్రం 135 మంది ఎమ్మెల్యేలు: డీకే శివకుమార్

మనసు మార్చుకున్న డీకే …ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం …

  • My powe is 135 MLAs says DK ShivaKumar

కాంగ్రెస్ పార్టీ తన అధ్యక్షతననే 135 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిందని, వీరందరి మద్దతు తనకే ఉందని ఆ పార్టీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. సీఎం ఎంపిక అంశాన్ని అధిష్ఠానానికి వదిలేస్తామని తొలుత నిర్ణయించినప్పటికీ, కొంతమంది వారి వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరుల సంఖ్యాబలం గురించి తాను ఏమీ మాట్లాడనని, తన సంఖ్యాబలం మాత్రం 135 అన్నారు. క్షేత్రస్థాయి నుండి మరింత సహకారం ఉంటే సీట్లు పెరిగేవని, అయినప్పటికీ ఫలితాల విషయంలో తాము సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు.

కర్ణాటక కాంగ్రెస్ లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. సిద్ధరామయ్య ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. డీకే కూడా ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. రేసులో ఇద్దరు కీలక వ్యక్తులు ఉండటంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏం నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది.

Related posts

తెలుగు తల్లి, తెలంగాణ బిడ్డ అంటూ షర్మిలకు గద్దర్ ప్రశంసలు..!

Drukpadam

వామ్మా బాబోయ్ ఇంతమంది పోలీసులా? ఇది ఎన్నికనా?? యుద్దమా ???

Drukpadam

తనకు 69 ఏళ్లు వచ్చాయి.. ముసలోడిని అవుతున్నా: కేసీఆర్

Drukpadam

Leave a Comment