Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

మొదటి రెండు సంవత్సరాల సీఎం గా సిద్దు …తర్వాత 3 సంవత్సరాలు డీకే…?

మొదటి రెండు సంవత్సరాల సీఎం గా సిద్దుతర్వాత 3 సంవత్సరాలు డీకే…?
కేపీసీసీ అధ్యక్షుడుగా డీకే కొనసాగింపుడిప్యూటీ సీఎం గా ఆఫర్
ఒకరిది అనుభవంమరొకరిది నిర్మాణము
నాలుగురోజులుగా సీఎం సీటుకు కోసం పంతం
అధిష్టానం జోక్యంఖర్గే ..సోనియా ,రాహుల్ తో వరస చర్చలు
చివరికి డీకేని ఒప్పించిన అగ్రనేతలు
రాహుల్ తో గంటన్నరకు పైగా డీకే శివకుమార్ భేటీ
అంతకు ముందు సిద్దరామయ్య తో ఖర్గే , రాహుల్ వరస భేటీలు
ఇంకా సీఎం ఎవరనేది నిర్ణయించలేదన్న సూర్జేవాలా
బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని వినతి

 

 

 

 

డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ …?

 

 

కర్ణాటకలో సీఎం సీటుకు కోసం గత నాలుగురోజులుగా ఇద్దరు నేతల మధ్య నలుగుతున్నపంచాయతీ ఒక కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అయిపోయిందని , అది వెనిలేటర్ మీద ఉందని జరుగుతున్నా ప్రచారాన్ని తిప్పుకోడుతూ కన్నడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోశారు .బీజేపీ మాటలు నమ్మకుండా కాంగ్రెస్ కు పట్టకట్టి దాని పని అయిపోలేదని చాటారు .అయితే సీఎం సీటు విషయంలో నాయకుల మధ్య వచ్చిన పొరపొచ్చాలు గత నాలుగు రోజులుగా తొలగించేందుకు అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అధిష్టానం సిద్దు , డీకేల మధ్య సీఎం సీటు విషయంలో రాజీ ఫార్మలా ను తెచ్చింది. అయితే డీకే శివకుమార్ చివరివరకు తనకే ఐదు సంవత్సరాలు సీఎం గా నియమించాలని కోరారు . చివరకు మల్లిఖార్జున ఖర్గే , రాహుల్ గాంధీ , సోనియా తదితరుల జోక్యం తో ఎట్టకేలకు డీకే అంగీకరించడంతో సిద్దరామయ్య కు లైన్ క్లియర్ అయింది .

మొదటి రెండు సంవత్సరాలు సిద్దరామయ్య సీఎం గా ఉంటారు . తర్వాత 3 సంవత్సరాలు డీకే శివకుమార్ సీఎం గా ఉండే విధంగా రాజీ కుదిరంట్లు తెలుస్తుంది . అంతే కాకుండా కేపీసీసీ అధ్యక్షుడు గా శివకుమార్ కొనసాగుతారు . క్యాబినెట్ లో కూడా రెండు ముఖ్యమైన పోర్ట్ పోలియో లు కూడా ఇవ్వనున్నట్లు సమాచారంఅయితే దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా మాట్లాడుతూ ఇంకా సీఎం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మీడియా సమావేశంలో తెలిపారు . రానున్న 48 గంటలు క్యాబినెట్ కొలువు తీరుతుందని ఆయన ప్రకటింహరు . ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఐదు వాగ్దానాల వెంటనే నెరవేర్చడం జరగుతుందని ఆయన పేర్కొన్నారు . సీఎం నిర్ణయంపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు

 

Related posts

యాసంగిలో కిలో వడ్లు కూడా కొనలేం… చేతులెత్తేసిన రాష్ట్రప్రభుత్వం 

Drukpadam

పార్లమెంట్​లో ఈ పదాలు ఇక వాడకూడదు.. బుక్ లెట్ విడుదల!

Drukpadam

మిర్చికి నష్టపరిహారం ప్రకటించకపోతే …కేటీఆర్ పర్యటన అడ్డుకుంటాం :పోటు రంగారావు!

Drukpadam

Leave a Comment