Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కడప జిల్లా రాజకీయాల్లోకి మరో వైయస్ కుటుంబసభ్యుడు …డాక్టర్  అభిషేక్ రెడ్డి …

 

కడప జిల్లా రాజకీయాల్లోకి మరో వైయస్ కుటుంబసభ్యుడు …డాక్టర్  అభిషేక్ రెడ్డి …

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డితో కలిసి తిరిగిన వైఎస్ అభిషేక్‌రెడ్డి
కడప రాజకీయాల్లో సరికొత్త చర్చకు కారణమైంది.
అభిషేక్ రెడ్డి విశాఖలో డాక్టర్ గా స్థిరపడిన వ్యక్తి
మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అభిషేక్ ఎంటర్

ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకరిని మించి మరొకరు ఎత్తులు పై ఎత్తులతో రాజీయాల్లో వేగం పెంచారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలతో ప్రజల్లో ఉండగా , జగన్ పరిపాలనలో వైఫల్యం చెందారని సైకో గా మారారని మాజీ సీఎం చంద్రబాబు , ఆయన తనయుడు లోకేష్ , జనసేనాని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరుగుతున్నారు. జగన్ ను ఓడించడమే తన లక్ష్యమని పవన్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు రైట్ ,లెఫ్ట్ అనే తేడా లేకుండా వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తానని అంటున్నారు. వీరు పన్నాగాలు దీటుగా సీఎం సీట్లో కూర్చున్న జగన్ కూడా కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు . తన బాబాయ్ వివేకా హత్య కేసులో తేడాలొస్తే తన కుటుంబసభ్యులను కడపలో రంగంలోకి దించేందుకు పావులు కదుపుతున్నారు . ఆయన బాబాయ్ మానవడైన వైయస్ అభిషేక్ రెడ్డిని రంగంలోకి దించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ప్రస్తుతం విశాఖపట్నంలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు . బుధవారం కడపనియోజకవర్గంలో ఎంపీ అవినాష్ రెడ్డితో కలిసి పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు రానున్న ఎన్నికల్లో కొన్ని భాద్యతలు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది .

వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో నిన్న వీరిద్దరూ పర్యటించారు. ఇప్పటి వరకు తెరవెనక ఉన్న అభిషేక్ రెడ్డి ఇప్పుడు బయటకు రావడంతో పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను ఆయనకు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది.

విశాఖపట్టణంలో వైద్య వృత్తిలో స్థిరపడిన అభిషేక్ రెడ్డి.. అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి అన్న ప్రకాశ్‌రెడ్డికి మనవడు. అవినాశ్ రెడ్డితో కలిసి పర్యటనలో పాల్గొనడం ఇదే తొలిసారి. తాజా పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గ బాధ్యతలు ఆయనకు అప్పగించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Related posts

కేసీఆర్ సొంత పొలంలో పండిస్తున్న వరి ధాన్యాన్ని ఏ ఐకేపీ సెంటర్ లో అమ్మారు? రేవంత్ రెడ్డి

Drukpadam

తరలింపే తక్షణ ప్రధాన కర్తవ్యం: 31 పార్టీల అఖిలపక్ష సమావేశంలో కేంద్రం స్పష్టీకరణ!

Drukpadam

సీఎం కాన్వాయ్ కోసం అపరిచితుడి కారు అడగకుండా తీసుకెళ్లిన ఒంగోలు పోలీసులు!

Drukpadam

Leave a Comment