ఖమ్మం జర్నలిస్టుల స్వప్నం నెరవేర్చిన చారితర్ధుడు మంత్రి అజయ్
-ఆయన్ను సత్కరించుకోవడం మన భాద్యత
-కృతజ్ఞత సభను జయప్రదం చేయండి ఐజెయు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంనారాయణ
ఖమ్మం జర్నలిస్టుల 20 సంవత్సరాల కలను నెరవేర్చిన చారితర్దుడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అని టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఇప్పటి తెలంగాణలోనూ ఏ మంత్రి సాధించలేని ఘనతను ఆయన సాధించారన్నారు. టియుడబ్ల్యూజె (ఐజెయు) సమావేశం శనివారం ఖమ్మం నగర కమిటీ అధ్యక్షులు మైసా పాపారావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాంనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం 23 ఎకరాలను కేటాయింపజేయడమే కాకుండా మంత్రి వర్గ సమావేశంలో ఆమోదింపజేయడం వెనక మంత్రి అజయ్ అవిరళ కృషి, పట్టుదల దాగి ఉన్నాయన్నారు. సెక్రటేరిట్ నుంచి ఒక ఫైల్ ఇంత త్వరగా ఆయన శాసన సభ్యునిగా ఎన్నికైన నాటి నుంచి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్న ఆలోచనతో కృషి చేశారన్నారు. జర్నలిస్టులతో సన్నిహితంగా ఉంటూ వారి ఇబ్బందులను తెలుసుకుని వారికి బాసటగా నిలవడం పట్ల టియుడబ్ల్యూజె (ఐజెయు) కృతజ్ఞతలు తెలియజేస్తుందన్నారు. జర్నలిస్టు సమాజానికి ఇండ్ల స్థలాలను సమకూర్చిన మంత్రి అజయ్ కు కృతజ్ఞతలు తెలిపి సత్కరించడం కోసం ఈనెల 21న ఆదివారం సాయత్రం నాలుగు గంటలకు జెడ్పి సమావేశ మందిరంలో కృతజ్ఞత సభను ఏర్పాటు చేసినట్లు రాంనారాయణ తెలిపారు. జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై కృతజ్ఞత సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఇండ్ల స్థలాల సాధన కోసం టియుడబ్ల్యూజె (ఐజెయు) వివిధ రూపాలలో ఆందోళనలు నిర్వహిస్తూ వచ్చిందన్నారు. అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు ఇళ్లస్థలం అందాలన్నదే టియుడబ్ల్యూజె (ఐజెయు) లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు మాటేటి వేణుగోపాల్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, జిల్లా కోశాధికారి నాగండ్ల శివానంద, నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్, యూనియన్ జిల్లా నాయకులు మోహినుద్దీన్, నలజాల వెంకట్రావు, వై. మాధవరావు, తాళ్లూరి మురళి, జనార్ధనాచారి, నామ పురుషోత్తం, బసవేశ్వరరావు, వాసు, భూపాల్, మహేందర్, అయ్యప్ప, కమటం శ్రీను, మేడి రమేష్, భవానిసింగ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.