Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ కు భారీగా సన్మానం చేస్తా … కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి…

కేసీఆర్ కు భారీగా సన్మానం చేస్తా … కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి…
-మెడికల్ కాలేజీ పై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్న జగ్గారెడ్డి
– సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు
సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ప్రకటించడం పై హర్షాతిరేకాలు
మూడేళ్లుగా పోరాటం చేశానని వెల్లడి
కుమార్తెతో కలిసి పాదయాత్ర చేశానని వివరణ
కాలేజీకి రూ.1000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి
పార్టీకి సంబంధం లేదని వ్యాఖ్యలు
సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కు భారీ ఎత్తున సన్మానం చేస్తానని తెలిపారు. మెడికల్ కాలేజీ సంగారెడ్డి లో ఏర్పాటు చేసుతున్నట్లు ప్రకటించడంపై కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. సంగారెడ్డిలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామంటూ ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని జగ్గారెడ్డి వెల్లడించారు. సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇస్తే వెళ్లి కలుస్తానని, వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుకుంటానని వివరించారు. ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదన్నారు.

జగ్గారెడ్డి సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ, వైద్య కళాశాల కోసం తన పోరాటం ఇప్పటిది కాదన్నారు. మూడేళ్లుగా పోరాడుతున్నానని, తన కుమార్తెతో కలిసి అసెంబ్లీకి పాదయాత్ర కూడా చేశానని వెల్లడించారు. వైద్య కళాశాలకు సీఎం రూ.1000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలని, ఆ రోజున కేసీఆర్ కు భారీ ఎత్తున సన్మానం చేస్తానని చెప్పారు.

Related posts

మళ్ళీ .రెండు రాష్ట్రాల సీఎంల  సెంటిమెంట్  డ్రామాలు …బండి సంజయ్ విమర్శ!

Drukpadam

వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ రాకపోవచ్చు: మాజీ మంత్రి బాలినేని!

Drukpadam

నేను ఇకనుంచి పాలేరు బిడ్డను …రాజన్న రాజ్యం తెస్తా :షర్మిల

Drukpadam

Leave a Comment