ప్రేమ పేరుతో డబ్బులు దండుకుంటున్న హైదరాబాద్ మహిళా కానిస్టేబుల్…?
- ఏఆర్ హెడ్ క్వార్టర్ లో పని చేస్తున్న సంధ్యారాణి
- ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న వైనం
- తాజాగా చరణ్ అనే వ్యక్తిని పెళ్లాడిన సంధ్య
హనీ ట్రాప్ పేరుతో మగవారిని వల్లో వేసుకుంటూ హైదరాబాదుకు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ డబ్బులు దండుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే, ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో సంధ్యారాణి అనే మహిళా కానిస్టేబుల్ పని చేస్తోంది. ఇప్పటికే ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఇద్దరు భర్తలు విడాకులు తీసుకోగా… మరొకరు ఆమె వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా షాబాద్ మండలానికి చెందిన చరణ్ తేజను ట్రాప్ చేసి, ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకుంది.
ఆమెను పెళ్లి చేసుకోవడానికి చరణ్ తేజ నిరాకరించగా.. ఎస్సీ, ఎస్టీ కేసు పెడతానని బెదిరించి ఆమె పెళ్లాడింది. అయితే, ఆమె పూర్వ చరిత్ర గురించి తెలుసుకున్న చరణ్… ఆమె నుంచి తనను రక్షించాలని కోరుతూ శంషాబాద్ డీసీపీ, షాబాద్ పోలీస్ స్టేషన్లకు ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. మోసాలకు పాల్పడుతున్న సంధ్యను పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి సస్పెండ్ చేయాలని కోరాడు. చరణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణను మొదలు పెట్టారు.