Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కర్ణాటక నూతన సీఎం సిద్ధరామయ్యకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు…

కర్ణాటక నూతన సీఎం సిద్ధరామయ్యకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు…

  • కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం
  • సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్
  • ఈ మధ్యాహ్నం ప్రమాణస్వీకారోత్సవం
  • సిద్ధరామయ్య, డీకే తమ పదవీకాలంలో విజయవంతం కావాలని మోదీ ఆకాంక్ష
m

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఈ మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయడం తెలిసిందే. సిద్ధరామయ్య కర్ణాటక సీఎం పీఠం అధిష్ఠించడం ఇది రెండోసారి.

ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాలతో జయభేరి మోగించగా, తీవ్ర చర్చోపచర్చల అనంతరం కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధరామయ్యను సీఎంగా, రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో, నేడు సిద్ధరామయ్య పదవీ ప్రమాణం చేశారు.

దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సిద్ధరామయ్యకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. వారు తమ పదవీకాలంలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు మోదీ తెలిపారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ మేరకు ట్వీట్ చేశారు.

Related posts

హుజురాబాద్ లో మంత్రి హరీష్ రావు అరాచకాలు …బెదిరింపులు :ఈటల!

Drukpadam

ప్రధాని నోటా మరోసారి జమిలి మాట …

Drukpadam

‘పప్పు’ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందన…

Drukpadam

Leave a Comment