జర్నలిస్టుల ఇళ్లస్థలాలు ఆశించి కాదు ఆలోచనతో చేశా…మంత్రి పువ్వాడ ..!
-జర్నలిస్టుల కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పనకు కట్టుబడి ఉన్నా
-జర్నలిస్టు కుటుంబాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతోనే ఇంటిస్థలం
-జర్నలిస్టు కాలనీకి రెండు కోట్ల నిధుల కేటాయింపు
-టియుడబ్ల్యూజె (ఐజెయు) అభినందన సభలో మంత్రి అజయ్
-మంత్రికి ఘన స్వాగతం పలికిన జర్నలిస్టులు, భారీ ర్యాలీ
-గజమాలతో సత్కారం
ఏదో ఆశించి జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం కృషి చేయలేదని వారి కండ్లలో ఆనందం చూడాలని, వారి దశాబ్దాల కలను నెరవేర్చాలని పట్టుదలతో పనిచేసి 23 ఎకరాలు కేటాయింపజేయడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. దశాబ్ద కాలంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా జర్నలిస్టుల ఇబ్బందులను అతి దగ్గర నుంచి చూశానని వారి రెండు దశాబ్దాల కోరికను నెరవేర్చేందుకు సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రులు కేటిఆర్, హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అజయ్ తెలిపారు. ఆదివారం టియుడబ్ల్యూజె (ఐజెయు) ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో మంత్రి అజయ్ కుమార్ కు కృతజ్ఞతా పూర్వక అభినందన సత్కార సభ జరిగింది. సభకు ముందు అజయ్ కు జర్నలిస్టులు ఘన స్వాగతం పలికారు. ఇల్లందు క్రాస్ రోడ్డు సమీపం నుంచి కోయ నృత్యాలు, డప్పు బృందాలతో వందలాది మంది జర్నలిస్టులు పూలవర్షం కురిపిస్తూ సభా వేదిక వద్దకుతోడ్కొని వచ్చారు . టీయూడబ్ల్యూ జె (ఐజేయూ )ఆధ్వరంలో జరిగిన ఈ ఘనస్వాగతం కార్యక్రమానికి మంత్రి పులకించిపోయారు. రాజకీయ పార్టీలను మరిపించే రీతిలో జరిగిన ఈ స్వగతం సత్కారం తనజీవితంలో మర్చిపోలేనిది మంత్రి సంతోషం వ్యక్తం చేశారు .
జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్న డా॥ బిఆర్ అంబేడ్కర్, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు మంత్రి అజయ్, జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్రాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నగర కమిటీ అధ్యక్షులు మైసా పాపారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఖమ్మంలో అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్న జర్నలిస్టులు కనీస స్థలానికి నోచుకోకపోవడం ఇబ్బందిగా భావించానని ఎలాగైనా నివాస స్థలాన్ని ఇప్పించాలని గత సంవత్సర కాలంగా వివిధ రూపాల్లో ప్రయత్నించానన్నారు. బిపిఎల్ కింద నివాస స్థలాలను కేటాయిస్తే కేవలం 70 గజాలు మాత్రమే వస్తుందని అందుకనే దూరదృష్టితో కేసిఆర్ పేరిట సొసైటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తొలి దశలో ఐదు ఎకరాలను కేటాయించామని ముఖ్యమంత్రి కేసిఆర్ ఖమ్మం బహిరంగ సభలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీ మేరకు మంత్రులు కేటిఆర్, హరీష్ రావు సహయ సహకరాలతో ఈనెల 18న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలలంలో జరిగిన మొదటి కేబినెట్ లో ఖమ్మం జర్నలిస్టులకు 23 ఎకరాల కేటాయింపుకు ఆమోదం లభించిందన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారి, రెవెన్యూ ఇరిగేషన్ ఉన్నతాధికారులు కూడా పూర్తి సహాయ సహకరాలను అందించారని తెలిపారు. కేసిఆర్ తన మంత్రి వర్గంలో తనకు స్థానం కల్పించడం వల్లే ఈ కార్యక్రమాన్ని నెరవేర్చగలిగానని ఆయన తెలిపారు. ఇండ్ల స్థలాల కోసం మూడు దశాబ్దాలుగా టియుడబ్ల్యూజె (ఐజెయు) చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పలుమార్లు ఐజెయు నాయకులు ఇండ్ల స్థలాల సమస్యను తన దృష్టికి తీసుకు వచ్చారని ఆయన తెలిపారు. సుడా నిధుల నుంచి రెండు కోట్ల రూపాయలను జర్నలిస్టుల కాలనీకి కేటాయిస్తున్నామని కార్పోరేషన్ నుంచి మౌళిక వసతుల కల్పన జరుగుతుందన్నారు.
నిరభ్యంతరంగా జర్నలిస్టులు ఇండ్లు నిర్మించుకోవచ్చునని ఆయన తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన ఇండ్ల స్థలాలను సద్వినియోగం చేసుకోవాలని అజయ్కుమార్ కోరారు. ఖమ్మం నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని అనేక అవాంతరాలను అధికమించి అసాధ్యాలు అనుకున్న అనేక పనులను సుసాధ్యం చేశామన్నారు. భవిష్యత్తులో సైతం ఖమ్మం నగరాభివృద్ధిలో ఇదే రీతి కొనసాగుతుందని జర్నలిస్టులకు అన్ని విధాలా ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా జర్నలిస్టులకు 23 ఎకరాలు కేటాయింపజేయడం అది తన నియోజక వర్గంలో జరగడం అత్యంత సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఖమ్మం నగర అభివృద్ధికి అన్ని విధాలా జర్నలిస్టు మిత్రులు సహాయ సహకరాలను అందించాలని ఆయన కోరారు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనుడు మంత్రి అజయ్ : రాంనారాయణ
అసాధ్యాన్ని మంత్రి అజయ్ కుమార్ సుసాధ్యం చేశారని యావత్ జర్నలిస్టు సమాజం ఆయనకు రుణపడి ఉంటుందని టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ తెలిపారు. మంత్రి అభినందన సభలో రాంనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలోనూ జర్నలిస్టులకు ఈ విధమైన భూకేటాయింపు జరగలేదని తెలంగాణ ఏర్పా తొలిసారి ఖమ్మంజిల్లా జర్నలిస్టులకు దక్కడం వెనక మంత్రి అవిరళ కృషి, నిరంతర శ్రమ దాగి ఉన్నాయన్నా తాము ఆందోళనలు చేశామని గతంలో ఏ ప్రభుత్వం, ఏ మంత్రి కూడా ఈవిధంగా స్పందించ లేదని మాటల చూపుతానని నిరూపించారని రాంనారాయణ తెలిపారు. జర్నలిస్టు వృత్తి ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న ప్రస్తుతి.. జర్నలిస్టులకు ఓ భరోసా ఇవ్వడంలో ఆయన ముందు నిలిచారని రాంనారాయణ తెలిపారు. మొదటి నుంచి కూడా ఏదైనా అనుకుంటే సాధించే వరకు విశ్రమించని నాయకునిగా అజయ్కు పేరుందని దానిని మరోసారి నిరూపించుకున్నారన్నారు. టియుడబ్ల్యూజె (ఐజెయు) మంత్రికి అన్ని వేళల వెన్నంటి నిలుస్తుందని జీవిత కాలం గుర్తుంచుకుంటామని రాంనారాయణ తెలిపారు.
ఏనుగు వెంకటేశ్వరరావు అతిథులను వేదికపైకి ఆహ్వానించిన ఈసభలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు.మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా ఛైర్మన్ బచ్చు విజయకుమార్, యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మాటేటి వేణుగోపాల్, జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్, అక్రిడేషన్ కమిటీ సభ్యులు గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పరిటాల సత్యనారాయణ, యూనియన్ జిల్లా కోశాధికారి నాగండ్ల శివానంద, కెమెరామెన్ అసోసియేషన్ నాయకులు అప్పారావు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్, టియుడబ్ల్యూజె ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, యూనియన్ బాధ్యులు, వివిధ పత్రికల ప్రతినిధులు, వందలాది మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. మంత్రి అజయ్ కుమార్ను రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంనారాయణను జర్నలిస్టులు గజమాలతో సత్కరించారు.