Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హైద్రాబాద్ ఫిలిం నగర్ లో ఎన్టీఆర్ కు మంత్రి అజయ్ నివాళులు …

హైద్రాబాద్ ఫిలిం నగర్ లో ఎన్టీఆర్ కు మంత్రి అజయ్ నివాళులు …
-సత్తుపల్లిలో తుమ్మల ,సండ్ర బైక్ ర్యాలీ …
-ఖమ్మంలో పువ్వాడ వర్గీయుల నివాళులు …

నందమూరి తారకరామారావు కు గతంలో ఎన్నడూ లేనివిధంగా పార్టీలకు అతీతంగా నివాళులు అర్పించి తమ అభిమానాన్ని చాటుకున్నారు . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా , సినీ పరిశ్రమలో రారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ సేవలను కొనియాడారు . ఒక రకంగా చెప్పాలంటే ఖమ్మం జిల్లాలో టీడీపీ కన్నా బీఆర్ యస్ , పొంగులేటి అనుచరుల హడావుడి ఎక్కువగా కనిపించింది….

హైద్రాబాద్ ఫిలిం నగర్ లో పువ్వాడ నివాళులు ..

జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ ఎన్టీఆర్ విగ్రహానికి శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ తనయుడు మోహన్ కృష్ణ, మనవరాలు ప్రసన్న , జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో కలిసి రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘనంగా నివాళులర్పించారు. మంత్రి అజయ్ మాట్లాడుతూ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్నత శిఖరానికి ఎదిగి తమ నటనలో తనదైన గుర్తింపు సాదించుకున్నారని అన్నారు. ఎన్ని వైవిద్యమైన పత్రాలు పోషించి, విలక్షణమైన నటుడిగా, రాజకీయ నాయకుడిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన ఎన్టీఆర్ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు.

సత్తుపల్లి లో తుమ్మల ,సండ్ర షో … బైక్ ర్యాలీ …

సత్తుపల్లి పట్టణంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు , సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య
మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించి, నందమూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. ‘విశ్వ విఖ్యాత నటుడిగా, పరిపాలనాదక్షుడిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను సీఎం కేసీఆర్ పాటిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నారన్నారు. వారి ఆశయాలను కొనసాగించడమే ఆయనకీ మనమిచ్చే ఘనమైన నివాళి’ అని అన్నారు.

ఖమ్మంలో పువ్వాడ వర్గీయుల నివాళులు …

నగరంలోని ప్రభుత్వ పీజీ కళాశాల కూడలి ఎన్టీఆర్ విగ్రహం వద్ద మేయర్ నీరజ, తానా మాజీ అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ, సినీ హాస్య నటుడు శ్రీనివాస రెడ్డి, సుడా చైర్మన్ విజయకుమార్ పూలమాల వేసి ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. రాజకీయ నాయకుడిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందరికీ నచ్చే అరుదైన వ్యక్తి అని కీర్తించారు. వారి శతాబ్ది ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం తెలుగు ప్రజలకు గర్వకారణమన్నారు. తెలుగు వారికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కార్పొరేటర్ కర్నాటి క్రిష్ణ, బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు. పడాల నాగరాజు, నగర కమ్మ సంఘం అధ్యక్షులు రామారావు, మంత్రి పి.ఏ. చిరుమామిళ్ల రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

 

Related posts

ఐటీ ,ఈడీ దాడులకు భయపడబోము … టీఆర్ యస్ ఎమ్మెల్సీ పల్లా!

Drukpadam

2031 తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన.. కేంద్రం స్పష్టీకరణ!

Drukpadam

ఉరికొయ్యకు వేలాడే రైతుల శవాలు కనిపించట్లేదా?: సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ ఫైర్!

Drukpadam

Leave a Comment