క్రైమ్ వార్తలు

ఢిల్లీలో టీనేజి అమ్మాయిని దారుణంగా చంపిన ప్రేమికుడు…

ఢిల్లీలో టీనేజి అమ్మాయిని దారుణంగా చంపిన ప్రేమికుడు…

  • 16 ఏళ్ల బాలికతో సహజీవనం చేస్తున్న సాహిల్ అనే యువకుడు
  • బర్త్ డే పార్టీకి వెళ్లే విషయంలో ఇద్దరి మధ్య గొడవ
  • రోడ్డుపైనే బాలికను కత్తితో పొడిచిన యువకుడు
  • నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
  • బాలిక శరీరంపై 20కి పైగా కత్తి పోట్లు 

దేశ రాజధాని ఢిల్లీలో సహజీవనం నేపథ్యంలో, శ్రద్ధా వాకర్ అనే అమ్మాయి తన ప్రియుడు ఆఫ్తాబ్ చేతిలో దారుణంగా హతమైన సంగతి తెలిసిందే. ఢిల్లీలో అలాంటిదే మరో దారుణ ఘటన జరిగింది. ఓ టీనేజి అమ్మాయిని ప్రేమికుడే కిరాతకంగా చంపాడు.

సాహిల్ అనే యువకుడు 16 ఏళ్ల బాలికతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. గత రాత్రి ఓ బర్త్ డే పార్టీకి వెళ్లే విషయంలో ఇద్దరి మధ్య రోడ్డుపైనే వాగ్వాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని షాబాద్ డెయిరీ వద్ద అందరూ చూస్తుండగానే ఆ బాలికను సాహిల్ పొడిచి చంపాడు. పలుమార్లు కత్తితో పొడిచిన అనంతరం ఆమెపై బండరాయి వేశాడు.

నిందితుడు సాహిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక శరీరంపై 20కి పైగా కత్తిపోట్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ ఘటనపై విచారణకు జాతీయ మహిళా కమిషన్ త్రిసభ్య కమిషన్ ను నియమించింది.

Related posts

గురుగ్రామ్ లో దారుణం…ఆసుప్రతిలో చేరిన విదేశీ మహిళపై అత్యాచారం…

Ram Narayana

ముంబైలో పక్కింటి వారితో గొడవ… మహిళ కాల్చివేత..!

Drukpadam

ప్రియురాలి ఇంట్లో తండ్రి.. ఆగ్రహంతో ప్రాణాలు తీసిన కొడుకులు…

Ram Narayana