Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కవిత, బండి సంజయ్.. ఆప్యాయ పలకరింపులు…

ఒకే చోట కవిత, బండి సంజయ్.. ఆప్యాయ పలకరింపులు

  • నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు లక్ష్మీనరసయ్య గృహప్రవేశ కార్యక్రమం
  • కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్, కవిత
  • వెల్కమ్ టు నిజామాబాద్ అంటూ సంజయ్ ను ఆహ్వానించిన కవిత

బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గు మంటుంది. అలాంటి రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు ఒకేచోట కలవడం, ఆప్యాయంగా పలకరించుకోవడం ఎప్పుడో కానీ జరగదు. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒక వేడుకలో కలుసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బసవాపురం లక్ష్మీనరసయ్య గృహప్రవేశం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి సంజయ్, కవిత ఇద్దరూ విచ్చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ ఎదురుపడగా ఒకరికొకరు నమస్కారం చేసుకుని, ఆప్యాయంగా పలకరించుకున్నారు. వెల్కమ్ టు నిజామాబాద్ అంటూ బండిని కవిత ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాతో పాటు స్థానిక బీఆర్ఎస్ నేతలను సంజయ్ కు కవిత పరిచయం చేశారు. బండి సంజయ్ కూడా తమ నేతలను కవితకు పరిచయం చేశారు. వీరి కలయికకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

అమిత్ షాను కలిసే అవకాశాన్ని కల్పించండి: కిషన్ రెడ్డికి గద్దర్ విన్నపం!

Drukpadam

ప్రభుత్వ ఏర్పాటులో తలమునకలైన తాలిబన్లు.. జిహాదీలకు ప్రభుత్వంలో స్థానం!

Drukpadam

ఢిల్లీలో కేసీఆర్‌… బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప‌రిశీలించిన తెలంగాణ సీఎం!

Drukpadam

Leave a Comment