Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

దేశంలో బ్లాక్ ఫంగస్ కలకలం…..

దేశంలో బ్లాక్ ఫంగస్ కలకలం

-రాజస్థాన్‌పై బ్లాక్ ఫంగస్ పంజా.. అంటువ్యాధిగా ప్రకటించిన ప్రభుత్వం
-రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం కింద గుర్తింపు
-రాజస్థాన్‌లో వందకుపైగా బ్లాక్ ఫంగస్ కేసులు
-జైపూర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు
-బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్యశ్రీ లో చేర్చిన ఏపీ ప్రభుత్వం
-ఏపీలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు
-అప్రమత్తమైన ప్రభుత్వం
-ఉత్తర్వులు జారీ చేసిన అనిల్ కుమార్ సింఘాల్
-చర్యలు ప్రారంభించాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు ఆదేశం

దేశంలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది.ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో దీని బారినపడి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం దీన్ని అంటువ్యాధిగా ప్రకటించింది. ఇప్పటి వరకు దీని అంటూ వ్యాధి కాదనుకున్న. కానీ రాజస్థాన్ ప్రభుత్వ ప్రకటనతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ లోను బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించారు. కరోనా వచ్చి పోయిన వాళ్లకు ఈ వ్యాధి సోకుతుందని అంటున్నారు. అయితే ఎక్కువగా స్టెరాయిడ్ తీసుకున్న వాళ్లకు మాత్రమే ఈ జబ్బు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానికి అధైర్య పడవద్దని మందులు ఉన్నాయని అంటున్నారు. రాజస్థాన్ లో పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతున్నట్లు సమాచారం
కరోనా నుంచి కోలుకున్న వారిపై పగ సాధిస్తున్న బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) రాజస్థాన్‌పై పంజా విసురుతోంది. ఇప్పటి వరకు అక్కడ 100కుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారినపడిన వారికి చికిత్స అందించేందుకు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు కేటాయించారు.

కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్లాక్‌ఫంగస్‌ను అంటువ్యాధిగా గుర్తిస్తున్నట్టు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం-2020 కింద దీనిని గుర్తించదగిన వ్యాధుల్లో చేర్చినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అఖిల్ అరోరా తెలిపారు. బ్లాక్‌ ఫంగస్, కరోనాలకు సమగ్రమైన, సమన్వయంతో కూడిన చికిత్స అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.

కరోనా రోగుల్లో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారికి వచ్చే బ్లాక్ ఫంగస్ కు కూడా చికిత్స చేయాలని ఆదేశించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం నిర్ణయించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సపై వెంటనే చర్యలు ప్రారంభించాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోను ఆదేశించింది.

బ్లాక్ ఫంగస్ ఒక్క ఏపీలోనూ కాదు, దేశంలోని అనేక రాష్ట్రాలను ఆందోళనకు గురిచేస్తోంది. రాజస్థాన్ ఇప్పటికే దీన్ని అంటువ్యాధిగా ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఇక్కడి గంగారాం ఆసుపత్రిలో 40 మంది వరకు బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. దీని కారణంగా కంటి చూపు పోవడమే కాదు, రోగి మరణించే ప్రమాదం కూడా ఉండడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 

Related posts

అమెరికా నో మాస్క్-బట్ వన్ కండిషన్ … వ్యాక్సిన్ తీసుకుంటే

Drukpadam

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌

Drukpadam

దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం.. మహారాష్ట్రలో నమోదు

Drukpadam

Leave a Comment