శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్ పై వెంకట్ కాచర్ల దర్శకత్వంలో నరేష్ వర్మ నిర్మించిన బైరాన్ పల్లి చిత్రాన్ని ఈనెల తొమ్మిదో తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత నరేష్ వర్మ తెలిపారు.
ఈ చిత్రంలో విజయ్ కుమార్ , ప్రభావతి , కృష్ణ మంజూష , ప్రేమ్ సాగర్ , ప్రసాద్ పొద్దుటూరి ,సురేందర్ రాజు , మాధవి ప్రసాద్ , బలగం సుధాకర్ రెడ్డి , బలగం సుజాత, సురేష్ గడ్డం , లోరా మాడిసన్ , సత్య ప్రకాష్ , స్నేహ శర్మ ,డాలియా, సాయి రాజ్ , ప్రిన్స్ వెంకీ , సందీప్ సక్సేనా , రాజేష్ దామెర , శ్రీనివాస్ ఆసంపల్లి , రమేష్ చిన్న తదితరులు నటించారు. ఈ చిత్రం పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని దర్శకులు వెంకట్ కాచర్ల తెలిపారు. కెమెరా :డి వై గిరి , ఎడిటింగ్ : మహేంద్ర నాథ్ , బ్యాగ్రౌండ్ స్కోర్ :సందీప్ కుమార్ కనుగుల ,మ్యూజిక్ : పూర్ణచంద్ర బైరి , డిటిఎస్ మిక్సింగ్: రమేష్ కామరాజు (రామానాయుడు స్టూడియోస్), నిర్మాత: నరేష్ వర్మ , స్క్రిప్ట్ ,దర్శకత్వం: వెంకట్ కాచర్ల.