Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ!

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ!

  • ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం
  • 288 మంది దుర్మరణం
  • సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే బోర్డు నిర్ణయం
  • రైల్వే బోర్డు సీబీఐ విచారణకు సిఫారసు చేసిందన్న మంత్రి అశ్విని వైష్ణవ్

ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశాయి. అమెరికా ,పాక్ , బ్రిటన్ , లాంటి దేశాలు జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశాయి. ఒకేసారి మూడు రైళ్లు ఢీకొనడం , రైల్వే అధికారులు ప్రకటించిన ప్రకారం 288 మంది మృత్యువాత పడటం పై ప్రధాని సైతం నిశ్రేష్టులయ్యారు . హుటాహుటిన సంఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు . రైల్వే మంత్రి శ్రీవైష్ణవ అక్కడ మకాం వేసి స్వయంగా సహాయక చర్యలను పర్వవేక్షించారు . దేశంలో మూడవ అతిపెద్ద రైలు ప్రమాదంగా దీన్ని చెపుతున్నారు. దీనిపై పూర్తీ విచారణ జరపాలని రైల్వే బోర్డ్ సైతం నిర్ణయించింది.

ఒడిశాలో 288 మందిని పొట్టనబెట్టుకున్న ఘోర రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు నిర్ణయించినట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ దుర్ఘటనపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలని కేంద్ర రైల్వే బోర్డు సిఫారసు చేసిందని వివరించారు.

ఘటన స్థలంలో సహాయ చర్యలు, ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని, ఓవర్ హెడ్ వైరింగ్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కాగా, ప్రమాదం సమయంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ రైళ్లు పరిమిత వేగంతోనే ప్రయాణిస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు.

ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ కూడా సజావుగానే ఉందని, కానీ అందులో ఎవరైనా ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సిగ్నలింగ్ లోపమే ఈ ఘోర దుర్ఘటనకు కారణమని రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో పేర్కొనడం తెలిసిందే.

Related posts

మీ శుష్క వాగ్దానాలు వినీవినీ విసిగొచ్చేస్తోంది..ప్రపంచ వేదికపై నాయకుల దుమ్ము దులిపిన భారత్ అమ్మాయి!

Drukpadam

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ధీరజ్ సింగ్ ఠాకూర్.. ఆయన గురించి కొన్ని వివరాలు!

Ram Narayana

53 ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టులను రద్దు- తెలంగాణ హైకోర్టు

Drukpadam

Leave a Comment