క్రైమ్ వార్తలు

గేటు తీయడం ఆలస్యమైనందుకు టోల్ గేట్ ఉద్యోగి హత్య…!

గేటు తీయడం ఆలస్యమైనందుకు టోల్ గేట్ ఉద్యోగి హత్య…!

  • కర్ణాటక బిడది టోల్ గేట్ వద్ద ఆదివారం వెలుగు చూసిన ఘటన
  • గేట్ తీయడం ఆలస్యమైందంటూ ఇద్దరు సిబ్బందితో నిందితుల వాగ్వాదం
  • ఆ తరువాత సిబ్బంది భోజనానికి బయటకు రాగా హాకీ కర్రలతో దాడి
  • దాడిలో ఓ ఉద్యోగి అక్కడికక్కడే మరణించగా మరొకరికి తీవ్రగాయాలు
  • నిందితుల కోసం పోలీసుల గాలింపు

గేటు తీయడం ఆలస్యమైనందుకు ఇద్దరు టోల్ గేట్ సిబ్బందిపై కొందరు దాడి చేయడంతో ఓ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. కర్ణాటకలోకి బిడది పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

ఆదివారం రాత్రి బిడది టోల్ గేట్‌లో పవన్, అతడి సహచరుడు విధులు నిర్వర్తిస్తుండగా మైసూరుకు వెళుతున్న నలుగురు వ్యక్తులు కారులో అక్కడకు వచ్చారు. ఆ తరువాత గేటు త్వరగా తీయాలంటూ వాగ్వాదానికి దిగారు. వివాదం తీవ్ర రూపం దాల్చడంతో స్థానికులు ఇరు వర్గాలకు సర్దిచెప్పి పంపించారు.

అనంతరం ఆ నలుగురు వ్యక్తులు తమ కారును టోల్‌గేట్‌కు కొద్ది దూరంలో నిలిపారు. ఈలోపు పవన్, అతడి సహోద్యోగి భోజనం చేసేందుకు బయటకు వచ్చారు. ఇది గమనించిన ఆ వ్యక్తులు వారిపై ఒక్కసారిగా దాడికి దిగారు. హాకీ కర్రలతో చితకబాదారు. ఈ ఘటనలో పవన్ ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Related posts

లవ్ ట్రయాంగిల్.. ముంబైలో యువతి కాల్చివేత…

Ram Narayana

యూపీలో గన్ కల్చర్ …పోలీసుల సమక్షంలోనే ఇద్దరు కాల్చివేత…!

Drukpadam

ట్రాఫిక్ నిబంధనలు అంటే ఆమెకు లెక్కలేదు …

Ram Narayana