Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఈనెల 25 న ఖమ్మంలో భట్టి పీపుల్స్ మార్చ్ ముగింపు సభ …-నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ …

ఈనెల 25 న ఖమ్మంలో భట్టి పీపుల్స్ మార్చ్ ముగింపు సభ …-నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ …
-బీసిలపై కేసీఆర్ ప్రేమ కాదు ..ఎన్నికల స్టెంట్
-కుల వృత్తులకు రుణ సాయం భారీ మోసం
-కాంగ్రెస్ బిసి డిక్లరేషన్ తో కేసీఆర్ ఆగమాగం
-గతంలో వచ్చిన అప్లికేషన్ల రద్దులో ఆంతర్యం ఏంటో
-కుల ధ్రువీకరణ పత్రం రావాలంటే నెల రోజులు
-ఆదాయ పత్రానికి వారం రోజులు
-ఆర్థిక సాయం దరఖాస్తుకు 13 రోజులే గడువు
-ప్రతి ఒక్కరూ సభను విజయవంతం చేయాలి

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ ముగింపు సందర్భంగా ఈనెల 25 న ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు పీసీసీ సభ్యులు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ తెలిపారు . ఈసభకు పార్టీ అగ్రనేతలు ,రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ హాజరౌతారని అన్నారు . పీపుల్స్ మార్చ్ తో రాష్ట్రంలో కాంగ్రెస్ కు మంచి స్పందన వచ్చిందని అన్నారు . ఎర్రటి ఎండలో ,ఆకాల వర్షాలతో వచ్చిన ఇబ్బందులను సైతం తట్టుకొని ఇల్లు విడిచిన దగ్గర నుంచి ఇప్పటివరకు సాగించిన యాత్ర అమోఘమన్నారు . ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత ఈ యాత్ర ద్వారా అర్థం అయిందని అన్నారు

రాష్ట్రంలో ఉన్న బీసీలపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని జావేద్ ధ్వజమెత్తారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాల వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మోసం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పరిష్కారం చూపకుండా వాటిని రద్దుచేసి కుల వృత్తులకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అంటూ కొత్త మోసానికి బిఆర్ఎస్ ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు. గతంలో పెట్టుకున్న దరఖాస్తులను రద్దు చేసిన ప్రభుత్వం గతంలో 50,000 ఆర్థిక సాయం పొందిన వారిని అనర్హులుగా ప్రకటించడం విడ్డూరం అని అన్నారు. నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే ప్రతి ఒక్క బిసి కుటుంబానికి రుణ సాయం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగుతుండడంతో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రవేశపెట్టిన రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ తో పాటు త్వరలో ప్రవేశ పెట్టబోతున్న బీసీ డిక్లరేషన్తో కెసిఆర్ ఆగమాగం అవుతున్నాడని ఎద్దేవా చేశారు. ఆగమెఘాల మీద మంగళవారం రోజున బీసీ సంక్షేమానికి కెసిఆర్ మంగళం పాడారని ఆరోపించారు. మంగళవారం రోజున ఇచ్చిన జీవో చూస్తే అసలు ఈ పథకం అమలు అవుద్ధా అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.కుల ధ్రువీకరణ పత్రం పొందాలంటే రెవెన్యూ కార్యాలయంలో 30 రోజుల సమయం పడుతుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందాలంటే వారం రోజులు సమయం పడుతుందని అన్నారు. కానీ రుణ సాయం కోసం ధరఖాస్తు చేయడానికి ఇంకా 13 రోజులే గడువు ఇవ్వడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బీసీలపై కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు పాలకు దూడను ఇప్పి గేదేను తన్నమనడంలా ఉందని ఆరోపించారు.కేసీఆర్ కు బిసిలపై చిత్త శుద్ధి ఉంటే పారదర్శకంగా అందరికీ రుణ సాయం అందించాలని డిమాండ్ చేశారు. సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ఈ నెల 25న ఖమ్మంలో భారీ బహిరంగ సభతో ముగుస్తుందని ఈ సభకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అతిరథ మహారథులు, ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ పట్టణ, నగర నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్య వాదులు, మానవతా వాదులు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కార్పొరేటర్లు సైదులు నాయక్, వెంకటేశ్వర్లు, బాణాల లక్ష్మణ్, బాలాజీ నాయక్, కొప్పెర ఉపేందర్ లు మాట్లాడుతూ..పీపుల్స్ మార్చ్ ముగింపు సభ ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో 2వ డివిజన్ కార్పొరేటర్ మలిదు వెంకటేశ్వర్లు,49 వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లు, 8వ డివిజన్ కార్పొరేటర్ లాకావత్ సైదులు,5 వ డివిజన్ కార్పొరేటర్ పల్లేబోయిన భారతీ చంద్రం, 29 వ డివిజన్ కార్పొరేటర్ కొప్పెర సరిత ఉపేందర్, నగర బీసీ సెల్ అద్యక్షులు బాణాల లక్ష్మణ్, ఎస్టీ సెల్ నగర అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, రఘునాథ పాలెం మండల అధ్యక్షులు భూక్య బాలాజీ, మైనారిటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ బి హెచ్ రబ్బానీ, జిల్లా మైనారిటీ అధ్యక్షులు ముజాహిదీన్ హుస్సేన్, కిసాన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కొంటేముక్కుల నాగేశ్వరరావు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రవికుమార్, ఏసబాయిన శ్రీశైలం, తది తరులు పాల్గొన్నారు.

Related posts

నా కళ్ల ముందే కాంగ్రెస్ గెలుపు… నా మెజారిటీ కనబడుతుంది

Ram Narayana

చేతి గుర్తా …? కారు గుర్తా …? ఓటర్లు దేవుళ్ళు ఎవరిని కరుణించారు ..

Ram Narayana

ఉపేందర్ రెడ్డి కన్నీళ్లకు కరిగితే ఐదు సంత్సరాలు కన్నీళ్లు పెట్టాల్సిందే…పొంగులేటి

Ram Narayana

Leave a Comment