Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆ 19 చోట్ల… గెలిచిన టీడీపీ అభ్యర్థులే పోటీ చేస్తారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • రాజమండ్రిలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం
  • హాజరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి
  • ఏపీ ప్రభుత్వం అవినీతిమయం అని నడ్డా, అమిత్ షానే అంటున్నారని వెల్లడి
  • ప్రస్తుతం టీడీపీ చేతిలో 19 సీట్లు ఉన్నాయని వెల్లడి

రాజమండ్రిలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఆగదు, చంద్రబాబు యాత్ర ఆగదు, లోకేశ్ బాబు యాత్ర ఆగదు… ఎవరి యాత్రను అడ్డుకోలేరు… నా యాత్ర కూడా సాగుతుంది అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన అక్కినేని నాగేశ్వరరావు హిట్ గీతం ఆగదూ… ఆగదూ అంటూ పాడారు.

“జీవో నెం.1 తీసుకువచ్చి కోర్టులో మాడు పగలగొట్టించుకున్నారు. 30 యాక్ట్ అమలు చేసి ప్రజాస్వామ్య హక్కులు హరించాలని చూస్తే మూల్యం చెల్లించుకుంటారు. ఏపీని అవినీతి కేంద్రంగా మార్చారు, దోపిడీ కేంద్రంగా మార్చారు… కేంద్రం నిధులన్నీ దారిమళ్లిస్తున్నారు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని వాళ్లే అంటున్నారు.

పొత్తుల విషయానికొస్తే… ప్రస్తుతం టీడీపీ చేతిలో 19 సీట్లు ఉన్నాయి. ఆ 19 సీట్లలో ఎవరైతే గెలిచారో, ఆ టీడీపీ అభ్యర్థులే వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆ మేరకు నిర్ణయించారు” అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.

గత నాలుగేళ్లుగా వైసీపీకి బీజేపీ మద్దతిచ్చిందని, కానీ వైసీపీ అవినీతికి పాల్పడిన విషయం బీజేపీకి తెలిసొచ్చిందని అన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఏడుసార్లు కరెంటు చార్జీలు పెంచాడని, జగన్ కు సిగ్గుందా అని అడుగుతున్నామని అన్నారు.

Related posts

కైలాస దేశం ఎక్కడా లేదు… అసలు విషయం ఇదే!

Drukpadam

లాలూ ప్రసాద్ కు బెయిల్ మంజూరు…

Drukpadam

మోహన్ బాబుపై అసభ్యకరంగా పోస్టులు-పోలీసులకు ఫిర్యాదు

Drukpadam

Leave a Comment