Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

బీజేపీ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా ఖమ్మంలో గెలవలేరు…కూనంనేని

బీజేపీ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా ఖమ్మంలో గెలవలేరు: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని….

  • తెలంగాణలో బీజేపీ ఎక్కడా గెలవదన్న కూనంనేని  
  • కుల, మత రాజకీయాల అవసరం సీపీఐకి లేదని వెల్లడి
  • ధరణి పోర్టల్ లో లాభనష్టాలు రెండూ ఉన్నాయన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఖమ్మంలోనే కాదు తెలంగాణలో ఎక్కడా బీజేపీ గెలవలేదని, ఆ పార్టీ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా ప్రయోజనం ఉండదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం సీటును గెలుచుకునేది తామేనంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ ప్రభావం లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ గెలిచే అవకాశమే లేదని జోస్యం చెప్పారు.

అధికారం కోసం బీజేపీ తరహాలో కుల, మత రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదని కూనంనేని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తో లాభనష్టాలు రెండూ ఉన్నాయని చెప్పారు. పోర్టల్ లోని లోపాలను సరిదిద్దితే రైతులకు మేలు కలుగుతుందని చెప్పారు. ఇందుకోసం అఖిల పక్ష సమావేశం నిర్వహించి సమస్యలు తెలుసుకోవాలని, వాటికి పరిష్కారాలను స్వీకరించాలని తెలంగాణ ప్రభుత్వానికి కూనంనేని సాంబశివరావు సూచించారు.

Related posts

దమ్ముంటే పులివెందులలో గెలువు చూద్దాం:సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్!

Drukpadam

జడ్జిలుగా మారిన రాజకీయ నేతలు.. నేతలుగా మారిన జడ్జిలు.. ఎవరంటే..!

Drukpadam

కేసీఆర్ పాపులారిటీ తగ్గిపోతుందా ?

Drukpadam

Leave a Comment